Sunday, April 21, 2013

ఎలా తెలుపను?

మౌనానికి కారణమేమి చెప్పను
నిశిరాతిరిలో నిశ్శబ్ధానికి కారణమేమనను?

కన్నీటికి కారణమేం పలుకను
వర్షించే మేఘం గురించి ఏం వివరించను?

నిజమా అనడిగితే రుజువేం తీసుకురాను
నడిసంద్రంలోని నావకు లోతునెలా చూపను?

నా ప్రేమని గురించి నేనేం తెలుపను
నీగురించి నీవే నన్నడిగితే ఏమనను?