Sunday, December 15, 2013

నాప్రేమపుట్టుక

గుండెసవ్వడి ఎందుకో గుబులుగుంది
రోజూ నువ్వునాతో ఎందుకు ఉండవంది


ఊసులు ఎన్నో చెప్పి మాయమౌతావని
అయినా నీకే మనసిచ్చానని గేలిచేస్తుంది
వినిపిస్తున్న గుండెఘోష నీదానాదా అందిమెరిసేతారను తోకచుక్క చేసి రాలనీకంది
గాయపడ్డమది ముట్టుకుంటే మసౌతుంది


మరచిపోయి మరోగాయంచేసి నన్నుతాకితే
గమ్యంలేని గాలినై ధూళిలో కలిసిపోతానంది
నాప్రేమపుట్టుక నీపేరుతోటే ఆది అంతమంది

Monday, November 11, 2013

మనసు మనసుతో

మనసు మనసుతో అన్నది బాసచేయమని
ఎక్కడున్నా ఎన్నటికీ నన్ను మరచిపోవద్దని
ఋతువులెన్ని మారినా నీవు మారిపోవద్దని


ప్రేమమార్గంలో జంటగా నిన్ను తోడు రమ్మని
ప్రశాంతంగా ఉండనీయని ప్రేమకోరింది ప్రేమని
జీవితమే నీదని తెలిసడిగింది జీవంపోయమని


దూరమెంతైనా వెళ్ళినంత వేగిరం తిరిగిరమ్మని
ఇదిగో అదిగో అని మాటలతో మభ్యపెట్ట వద్దని
పగలైనా మబ్బేసినా వెన్నెలరేయైనా రారమ్మని 


ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి పెట్టి ప్రేమించమని
ఓ జ్ఞాపకమా మనసావాచా మరచిమారిపోవద్దనిTuesday, November 5, 2013

నాకిష్టం

ఎవరినీ కష్టపెట్టకూడదు అన్నదే నాకు ఇష్టం
నా వేదనా సామ్రాజ్యానికి మహారాణిని నేను
పరుల ఆనందం పంచన చేరే అనుభవంలేదు

అందరూ నవ్వుతూ ఉండాలన్నదే నా కోరిక
ఎదుటివారికి చెడును ఎన్నడూ నేను కోరను
ద్వేషాన్ని నాటి నీరుపోసి పెంచడం నాకురాదు

ఇతరుల కొరకు  ఎంతటి త్యాగానికైనా నే సిధ్ధం
వేరొకరికి కీడెంచి శాపాలతో జీవిస్తూ బ్రతకలేను
పొరపాటునైనా మనసు నొప్పించడం నాకురాదు

Monday, October 7, 2013

వ్యధాభారం

విశాల గగనంలో విహరించాలని....
గుప్పిట్లో ఆకాశాన్ని బంధించాలని
అనుకుంటూ ఊహల విహంగమై ఉంటే
నా మనసుని అందరూ చదివేస్తున్నారు
ఇంక నేను విరహాన్ని ఎలా వివరించను
వ్యధను అస్సలు ఇంకేం వ్యక్తపరచగలను?


                       *****

నీ మాటలు కరువై మనసు బరువై....
జీవనసారమేదో కరువై జీవితమే దిగులై
క్షణాలన్నీ యుగాలుగా మారి బోధిస్తుంటే
వినిపించదు ఏ జ్ఞానం నీవు నా కంటపడక
రెప్పలకు కునుకేమివ్వను నిన్ను చూసేదాక
యుగళగీతం ఏం పాడను సోలోగా మిగిలాక?

Wednesday, September 11, 2013

రా...

రా....ప్రేమ ఊసుల తైలంతో
ప్రణయజ్యోతిని వెలిగిద్దాం!!


రా....ఇరునయనాల కలయి
లో
ప్రేమసామ్రాజ్యాన్ని నిర్మిద్దాం!!


రా....ఒకరికోసం ఒకరంటూ
ప్రణయానికి పరిభాషగా నిలుద్దాం!!


రా....అవరోధాలను ఎదిరించి
ప్రేమంటే ఇదేనని నిరూపిద్దాం!!


రా....సహృదయ సహనంతో
ప్రణయవటవృక్షమై పైకెగబ్రాకుదాం!!

Sunday, August 25, 2013

ఇంతే నాకుచాలు

అందరాని చందమా నాకెందుకు
అద్దంలాంటి నామామ చాలునాకు
చక్కెరలేని పాలకోవా నాకెందుకు
చక్కనిమనసున్న బావే చాలునాకు
అందాల రాజకుమారుడు నాకెందుకు
అన్నీతెలిసిన అత్తకొడుకు చాలునాకు
సొమ్ముకావాలనే సోగ్గాడు నాకెందుకు
నన్ను మెచ్చిన సొగసరోడే చాలునాకు
చూడ చక్కని సుందరుడు నాకెందుకు
నాబుగ్గన దిష్టి చుక్కెట్టేవాడు చాలునాకు
బాసలెన్నో చేసే బడాబాబు నాకెందుకు
నానుదుటి బాసికమయ్యేవాడే చాలునాకు
అందరిలా అన్నీ అడిగేదాన్ని కానే కాను
కొందరిల కొన్ని కోరను... ఇంతే నాకుచాలు

Sunday, August 18, 2013

ఇదేం ప్రేమో!

అందరికీ అందుబాటులో ఉంటావు
నాకుమాత్రం అందకుండా పోయావు

అందరిపై కారుణ్యాన్ని చూపుతావు
నా కళ్ళలో ప్రేమనుమాత్రం చూడవు

అందరి గుండెలయలకర్థం చెబుతావు
నా గుండెఘోషనెందుకో వినకున్నావు

అందరితో పరిచయాలు స్నేహమంటావు
నా పరిచయమొక్కటే నీకు వింతంటావు

అందరికీ అర్థమై నాకు అర్థంకాకున్నావు
ఇదేమిటంటే ప్రేమంటే ఇదేనని అంటావు!

Sunday, July 21, 2013

నా ఊపిరి

కొంత మంచి మరింత మొండివాడివి
ఎలాంటివాడివైనా నీవు నావాడివి
కొంత అల్లరి మరింత అసూయపరుడివి
నా శింగారానికి కారణమైనోడివి
కొంత తెలివైన మరింత తిక్కా ఉన్నోడివి
ఏదోలా నా మనసు దోచిన వాడివి
కొంత నిజానివి మరింత కలల అలజడివి
నాలో దాగిన నా నమ్మకానివి
కొంత కొంటెతనం మరింత కోరినవాడివి
ఎందుకంటే నీవు నా నిరీక్షణవి
కొంత ప్రియం మరింత పౌరుషమున్నోడివి
నన్ను వలచి నాకు నచ్చినోడివి
కొంత రసికుడివి మరింత రాక్షసుడివి
ఏమైనా నేను శ్వాసించే ఊపిరివి

Friday, July 12, 2013

మీరేమంటారు?

వింతగా నా భావలకి రూపాలే మార్చేసి
ప్రశ్నలనీ జవాబులనీ వాళ్ళే చెప్పేసుకుని
నచ్చలేదన్న నా మనసుకి ముసుగేసి మార్చేసారు
రంగులు మారిస్తే ఊసరవెల్లి, మరి భావాలు మారిస్తే?

వింతగా ఉంది దూరమై దగ్గరైన నా ఈ ఒంటరితనం
స్వప్నాల మేడలైనా ఆనందాలతో నింపివేయబడలేదు
ఈ బంధాలనడుమ అందరూ వింతగా కనపడుతున్నారు
మాయలోకంలో అన్నీకొంటారు అమ్ముడౌతున్నంతకాలం!

వింతగా మారిన లోకంలో నేను అస్తిత్వాన్ని కోల్పోయి
అసలురూపానికి రంగులద్ది రాని నవ్వుని పెదవులపైదిద్ది
జీవితాన్ని సహజంగానటిస్తూ భ్రమలో బ్రతుకంటున్నారు
ఇలా శరీరాన్ని సౌక్యంగా బ్రతికిస్తూ మనసుని ఉరివేసి చంపేస్తే?

Friday, June 7, 2013

1/2మనసు

భాధే బాగుందన్న భ్రమలో ఉన్నాను

మరణాన్ని చేరబోయి నీకు చేరువైనాను


మౌన తీరాన్ని నీవు నాకు చూపావు


నా కంట కన్నీటి కెరటాలని తెప్పించావు


పైకి కనపడని గాయం భాధ పెడుతుంది


హృదయం సగమే నా దగ్గర మిగిలుంది


ఆ సగమైన మనసు మరోసగాన్ని కోరింది


నా మనసే నన్ను వెలివేసి జీవఛ్ఛవమైంది!

Sunday, May 26, 2013

ప్రేమంటే


 
ఏవేవో కలలు కన్నాను.... 
నన్ను మించి నిన్ను ప్రేమించాను
నీముందు నా మనసును ఉంచాను!


హృదయం పగిలింది....
నిశ్శబ్ధంగా రోధించింది
నీతో మాత్రం అది కేవలం భాధేనంది!


జంట విడిపోయి....
మనసులు మూగబోయినవి
అయినా అది ప్రేమేకాదంటూ అరిచింది!

Sunday, April 21, 2013

ఎలా తెలుపను?

మౌనానికి కారణమేమి చెప్పను
నిశిరాతిరిలో నిశ్శబ్ధానికి కారణమేమనను?

కన్నీటికి కారణమేం పలుకను
వర్షించే మేఘం గురించి ఏం వివరించను?

నిజమా అనడిగితే రుజువేం తీసుకురాను
నడిసంద్రంలోని నావకు లోతునెలా చూపను?

నా ప్రేమని గురించి నేనేం తెలుపను
నీగురించి నీవే నన్నడిగితే ఏమనను?

Monday, March 18, 2013

హృది వీధిలో...

నా  హృదయ వీధిలో విహరించే ఓ తీయని ఊహా
నా కళ్ళలో ఓ కమ్మని కలగా నిదురించ రావా....

నా గొంతు పలికే ప్రతి అక్షరం నీ నామమే కదా
నా ఊహాలతకి ఊపిరినీయ పరుగున నను చేరవా....

నా భావోధ్వేగాలని నియంత్రించే యంత్రానివి నీవు
నా కవిత ఆది అంత్యాల మధ్య ఖాళీని పూరించవా....

Monday, February 25, 2013

ఇంకెందుకు.!?

నా అరచేతి రేఖారాతలని నిందించి లాభమేమి?
నాతో పరిచయం ఎందుకని అడిగి లాభమేమి?
నా నుదిటిరాతలో లేని నీకై శోధించి లాభమేమి?

భావాలెన్నో బదుల్లేని ప్రశ్నలుగా మిగిలాయి!
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!

ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.


Thursday, February 7, 2013

గులాబీ గొప్ప

ఎర్రగులాబీకే ఆ అర్హతా?
ప్రేమకి అదేమైనా అధినేతా?


దానికున్న ముల్లే దాని రక్షణ
తిడతారందరూ అందంగా లేదనా

ముల్లుంది కనుకే గులాబి పదిలం
అందముందని కూడదు దానికాగర్వం

అందాన్ని చూసి కేవలం ఆనందిస్తారు
పరులకొరకు ప్రాకులాడితే ఆరాధిస్తారు


ప్రేమ పంచడానికి రోజాపువ్వే కావాలా?
ప్రతిఫలం ఆశించక చేసేపని పసిడి కాదా?

Tuesday, January 29, 2013

నాకోసం

నాకోసం నా వాడిగా వేచిచూస్తూ
నిజమయ్యే స్వప్న రహదారిపై
ప్రేమ పూలరేకుల తివాచీ పరచి
నా రాత గీతల ప్రేరణగా మారి
అనురాగల అపూర్వ పందిరిలో
ఊహించని అంబరాన్ని తాకేలా
ఊసుల ఉత్ప్రేరణలో బంధించి
నేను నీవుగా మారిన ఆరేయి
ఆనందమయ జీవితం నాదేకదా!

Saturday, January 5, 2013

తెలిపేదెల

నల్లని కురులను చూసి భయమేల
మోము మెరుపును నీవు కానలేదా! 

కవ్వించే చూపులకే కంగారుపడనేల
నాకే దక్కి కలను నిజం చేయరాదా!

మొగ్గలో మకరందముందని భ్రమేల
వికసించిన పూపరిమళం నీది కాదా!

నేను పలికే నిజాలకి సాక్ష్యం కావాల
ఎగసిపడే నా ఎదసవ్వడిని వినరాదా!

నిన్ను కోరిన నన్ను చూసి నవ్వాల
నువ్వేనేను అన్న బరోసానీయరాదా!

నువ్వంటే నాకు ఇష్టమని తెలిపేదెల
ప్రేమించే హృదయాన్ని కనుగొనరాదా!