Sunday, April 28, 2019

ఏమీలేవు

రేయింబవళ్ళు కళ్ళలో తేమ తప్ప 
మునపటి ఉత్సాహం జిజ్ఞాసా లేదు

ఉరుము మెరుపుల మేఘాలు తప్ప
వాన కురిసే ఛాయలు కనబడ్డంలేదు

మలుపులతో కూడిన మార్గాలు తప్ప 
ధైర్యంతో నడుస్తూ నడిపించే తోడేలేదు

మునుపటి ఆ ఆత్రుత ఆరాటమే లేదు
అప్పటి ఆ జ్ఞాపకాల అస్థిరనీడలు తప్ప 


1 comment:

  1. బాధల బాదల్ కనులు దాటి హోరుగాలిలో పెళుసుబారిన ఆశలపై కురవగా దోసిలి నిండుగా కన్నీటి ముత్యాలే

    కటిక చీకటి తెరలు దాటి వెలుగుల దరి చేరగా
    దీప్తమైన తేజోజ్వలమే నిండే ప్రతి హృదయపు గవాక్షాన

    నడయాడగా తోవలో ఎల్లలు దాటే ఉరిమే ఉత్సాహం
    పయనమవగా గమ్యమే కొద్ది మలుపు చేరగా దిక్చుసి అయస్కాంతమై గతము నుండి భవిష్యత్తుకు వర్తమానమై నిలువగా..

    జ్ఞాపకాలు కొన్ని మధురానుభూతి కలిగించ
    కొలిమిలో వేడిమిలా మంచు పర్వతాలు కరిగించ
    రెప్ప పాటులో ఏవో తెలియని ఆలోచన రేకేతించ


    ధరణి శ్రీత

    ReplyDelete