కొంత మంచి మరింత మొండివాడివి ఎలాంటివాడివైనా నీవు నావాడివి కొంత అల్లరి మరింత అసూయపరుడివి నా శింగారానికి కారణమైనోడివి కొంత తెలివైన మరింత తిక్కా ఉన్నోడివి ఏదోలా నా మనసు దోచిన వాడివి కొంత నిజానివి మరింత కలల అలజడివి నాలో దాగిన నా నమ్మకానివి కొంత కొంటెతనం మరింత కోరినవాడివి ఎందుకంటే నీవు నా నిరీక్షణవి కొంత ప్రియం మరింత పౌరుషమున్నోడివి నన్ను వలచి నాకు నచ్చినోడివి కొంత రసికుడివి మరింత రాక్షసుడివి ఏమైనా నేను శ్వాసించే ఊపిరివి
వింతగా నా భావలకి రూపాలే మార్చేసి ప్రశ్నలనీ జవాబులనీ వాళ్ళే చెప్పేసుకుని నచ్చలేదన్న నా మనసుకి ముసుగేసి మార్చేసారు రంగులు మారిస్తే ఊసరవెల్లి, మరి భావాలు మారిస్తే?
వింతగా ఉంది దూరమై దగ్గరైన నా ఈ ఒంటరితనం స్వప్నాల మేడలైనా ఆనందాలతో నింపివేయబడలేదు ఈ బంధాలనడుమ అందరూ వింతగా కనపడుతున్నారు మాయలోకంలో అన్నీకొంటారు అమ్ముడౌతున్నంతకాలం!
వింతగా మారిన లోకంలో నేను అస్తిత్వాన్ని కోల్పోయి అసలురూపానికి రంగులద్ది రాని నవ్వుని పెదవులపైదిద్ది జీవితాన్ని సహజంగానటిస్తూ భ్రమలో బ్రతుకంటున్నారు ఇలా శరీరాన్ని సౌక్యంగా బ్రతికిస్తూ మనసుని ఉరివేసి చంపేస్తే?