Friday, July 12, 2013

మీరేమంటారు?

వింతగా నా భావలకి రూపాలే మార్చేసి
ప్రశ్నలనీ జవాబులనీ వాళ్ళే చెప్పేసుకుని
నచ్చలేదన్న నా మనసుకి ముసుగేసి మార్చేసారు
రంగులు మారిస్తే ఊసరవెల్లి, మరి భావాలు మారిస్తే?

వింతగా ఉంది దూరమై దగ్గరైన నా ఈ ఒంటరితనం
స్వప్నాల మేడలైనా ఆనందాలతో నింపివేయబడలేదు
ఈ బంధాలనడుమ అందరూ వింతగా కనపడుతున్నారు
మాయలోకంలో అన్నీకొంటారు అమ్ముడౌతున్నంతకాలం!

వింతగా మారిన లోకంలో నేను అస్తిత్వాన్ని కోల్పోయి
అసలురూపానికి రంగులద్ది రాని నవ్వుని పెదవులపైదిద్ది
జీవితాన్ని సహజంగానటిస్తూ భ్రమలో బ్రతుకంటున్నారు
ఇలా శరీరాన్ని సౌక్యంగా బ్రతికిస్తూ మనసుని ఉరివేసి చంపేస్తే?

6 comments:

  1. చాలా బాగా express చేసారు.

    ReplyDelete
  2. అలా ఎవరో చెప్పారని మారిపోతే ఇంక మనకంటూ ఏం మిగలదుగా....వ్యధాభరితంగా ఉంది ఈ కవిత.

    ReplyDelete
  3. వింతగా ఉంది దూరమై దగ్గరైన నా ఈ ఒంటరితనం
    స్వప్నాల మేడలైనా ఆనందాలతో నింపివేయబడలేదు
    ఈ బంధాలనడుమ అందరూ వింతగా కనపడుతున్నారు
    మాయలోకంలో అన్నీకొంటారు అమ్ముడౌతున్నంతకాలం!
    జీవితాన్ని సహజంగానటిస్తూ భ్రమలో
    ఇలా శరీరాన్ని సౌక్యంగా బ్రతికిస్తూ మనసుని ఉరివేసి చంపేస్తే?..Matallo entati bhavam manasunu kadalinchi vestundi..NlO vunna A maromanishi litrakga EDchadu...anukokunda kondaru eechina ontaritanam entati bhadanu anubhavinchhela chesindemo.. Meru kachitanga padaharnala Telugu ammayee..Chalabaga rasaru ani cheppadaniki matalu vetukkunna dorakadamledu anduke Mee kavitalo naku manasolO durina nanni kadalinchina padalanu emo em chebutunnanu emcheppalanukunnao teliyadam leedu

    ReplyDelete
  4. మనసుని చంపుకోవడమెందుకండి?
    మనసుపై ముసుగేసుకుంటే కొన్నాళ్ళకి అన్నీ మరుగునపడతాయి.

    ReplyDelete
  5. ఆర్ద్రంగా ,అందంగా ఉంది

    ReplyDelete
  6. ఇంతవేదన మీకెందుకు తెలుగమ్మాయి

    ReplyDelete