Sunday, August 25, 2013

ఇంతే నాకుచాలు

అందరాని చందమా నాకెందుకు
అద్దంలాంటి నామామ చాలునాకు
చక్కెరలేని పాలకోవా నాకెందుకు
చక్కనిమనసున్న బావే చాలునాకు
అందాల రాజకుమారుడు నాకెందుకు
అన్నీతెలిసిన అత్తకొడుకు చాలునాకు
సొమ్ముకావాలనే సోగ్గాడు నాకెందుకు
నన్ను మెచ్చిన సొగసరోడే చాలునాకు
చూడ చక్కని సుందరుడు నాకెందుకు
నాబుగ్గన దిష్టి చుక్కెట్టేవాడు చాలునాకు
బాసలెన్నో చేసే బడాబాబు నాకెందుకు
నానుదుటి బాసికమయ్యేవాడే చాలునాకు
అందరిలా అన్నీ అడిగేదాన్ని కానే కాను
కొందరిల కొన్ని కోరను... ఇంతే నాకుచాలు

10 comments:

  1. చూడ చక్కని సుందరుడు నాకెందుకు
    నాబుగ్గన దిష్టి చుక్కెట్టేవాడు చాలునాకు so nice feel..

    మీ కోరికలన్నీ తీరేవే..:-)

    ReplyDelete
  2. మరి ఈ ఎంకి మాటలు ఆ నాయుడు బావ వింటున్నాడో ఏమో ... సరదా కొద్ది అన్నాను. ఏమనుకోకండి. చాల బాగా రాసారు కవితా. రియల్లీ ఇంప్రెస్సివ్. కుడోస్

    Sridhar Bukya

    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  3. మన తెలుగమ్మాయి మనసుని బాగా చదివేసింది . అందుకే జీవితానికేది కావాలో చక్కగా అన్నీ అడుగుతూ , ఎంచక్కా " చాలు నాకు " అనటం బహు భేష్గ్గా వుంది . అవి అన్నీ అందినాక ఇంక ఎవరికీ ఏమీ అక్కర్లేదు అని ఘంటాపధంగా చెప్పచ్చు .

    ReplyDelete
  4. ఇవ్వన్నీ ఒక్కడిలోనే చూడగలరా తెలుగమ్మాయిగోరూ:-)

    ReplyDelete
  5. ఇంకేంటి మీ కోరికలు అమ్మాయిగారు

    ReplyDelete
  6. అన్నీ లేకున్నా
    కొన్నైనా ఒక్కరిలో చాలును అనేగా ....

    nice feel and suitable image ...

    ReplyDelete
  7. తప్పక దొరుకుతాడు తెలుగు అమ్మాయి

    ReplyDelete
  8. ఎరుపెక్కిన బుగ్గల ఎంకి తన మానకోసం పరితపిస్తూ..పలికే ప్రతిపలు మనసులో ఉలిక్కిపాటు తెస్తుంది మనసైనవాడికోసం మనసును మదిస్తే జాలువారే అందమైన భాషలో నిండా ప్రేమతోకూడినదే ...తమదైన సైలిలో "తెలుగమ్మాయి" భావన తనలోని ఆంక్షను అక్షార్లో కూర్చి చేసిన ఈ మరుమల్లెల్ల చెండు అద్బుతంగాఉంది.... మనసైనవాడు ఎలా ఉండాలో చెప్పినతీరు అద్బుతం.... ఆ భావనలో ఉన్న ఆ మనిషి నిజంగా అదృష్టవంతుడు..Chala bagundi Telugu Ammi

    ReplyDelete
  9. అన్నీ చెప్పేసావుగా....ఇంక నచ్చినోడు దొరకడమే తడువాయే:-)

    ReplyDelete