Tuesday, September 9, 2014

ఎలా!?

ప్రేమలో పసిదాన్ని నేను,
ప్రేమించానని చెప్పేది ఎలా!
ఎంత ప్రేముందో చూపేదెలా?

నీవంటే నాకు చాలా ఇష్టం
గుండె నిండి నీవని చెప్పేదెలా!
నిన్ను నేను పొందేది ఎలా?

ప్రణయ తాపం నాలో ఎగసెనని
నీలోనూ ఆ మంటలు రేగెనేల!
జ్వాలనార్పే మార్గమేదో చెప్పవేల?

మనసు నీవు నావాడివంటున్నది
నీకు ఉన్న ప్రేమనైనా చూపించవేల!
సంబంధమేదో పెనవేసెయ్యి ఏదోలా.

3 comments:

  1. ప్రణయ తాపం నాలో ఎగసెనని
    నీలోనూ ఆ మంటలు రేగెనేల!
    జ్వాలనార్పే మార్గమేదో చెప్పవేల? :)ha :-)

    ReplyDelete
  2. ఇలా ఇష్టం కష్టం అనడమేనా ...ముందుకేమైనా సాగుతుందా :-)

    ReplyDelete
  3. ప్రేమ కుట్టిందా:-)

    ReplyDelete