Wednesday, November 11, 2015

నాకు తెలిసింది

నేనెరిగిన చర్య కేవలం నీ అడుగు నీడలో నేను
అప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే దూరం
ఈ నిరీక్షణలో నేను ఏమౌతానో అన్న చింతలేదు
అప్పుడున్న ధ్యాసలోనే ఇప్పుడు శ్వాసపీలుస్తున్నా!

కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!


5 comments:

  1. దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ బాగు బాగు

    ReplyDelete
  2. నీ అడుగు నీడలో నేను రెండింటికి తేడా లేదు

    ReplyDelete
  3. అన్నాయి కదండి.. భావావేశపు అలజడిలో కిమ్మనక భయమే బావురుమందేమో లిపిగారు.

    దగ్గర దూరాలే ప్రమాదకరం.. దూరపు దగ్గరలే శ్రేయస్కరం

    ReplyDelete
  4. కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ??

    ReplyDelete