ప్రియురాలు పిలిచె
ప్రియ ప్రియతమా...వానే వచ్చి ఒళ్ళే తడిసె
వలపు వసంతమే నిన్ను తలచి మైమరిచె!!
భ్రమరమే పులకరించి మకరందాన్ని కోరె
చూసిన నా కళ్ళలో ప్రేమ మెరుపుమెరిసె
నీ కోసం ఎదురుచూసే నయనాలే దాహమనె
ఆకలిని మరచిన దేహానికి నిదుర రాకపోయె
మది కోయిల రాగమే పాడి నిన్ను పిలిచె
జాగు చేయక రావా...నీ ప్రియురాలు పిలిచె!!
వస్తాడు ఆగండాగండి...
ReplyDelete
ReplyDeleteభలేగా పిలిచిందండీ ఆ కొంటె మాటల ప్రియురాలు !!
వస్తాడు వేగిరపడకండి :-)
ReplyDelete:-)
ReplyDeleteబాగుంది
కొంటె ప్రియురాలు:)
ReplyDeleteచిత్రము రాధిక ఐనా
ReplyDeleteపిలువంగా పిల్లనగ్రోవి చేతబూని
కృష్ణుడే బృందావనిని చేరుకునే వేళ
రాధామాధవ
~శ్రీ~