Sunday, May 21, 2017

తీరని కలలు

మనసు కోరిన వాటిని కనులు దూరం చేసెనని 
ముక్కలైన కలలు చెప్పలేనంటూనే చెప్పేసాయి!

దరిచేరి దక్కని వాటిపైనే ప్రాకులాట అధికమని 
విరిగిన మనసే వివరించి వేదనతో ఓదార్పు కోరే!

అసలు ఆశించింది ఏమిటి చివరికి మిగిలిందేమని 
ఆవిరైన కన్నీరే అలసిన మనసుని ప్రశ్నించింది!

కోరికలు నింగిని తాకొచ్చి మరల దరి చేరలేనని
ప్రపంచాన్నే వెలివేసి ప్రాణం వదిలి గాలిలో కలిసె!  

2 comments:

  1. తీరని కలలతో చింత వద్దు 😊

    ReplyDelete
  2. పచ్చా పచ్చని చిలుకపచ్చ
    పైరు గాలి వీయగా ఆకుపచ్చ
    :
    కొన్ని కలలు కలలుగానే మిగిలిపోతాయి
    మరి కొన్ని
    కన్నుల వాకిలి దాటి ఎదురుపడతాయి
    మరి కొన్ని
    కనుజారిన బిందువుల తడి చెంపను తాకుతాయి
    :
    హృదయాన్ని కరిగించింది.. జ్ఞాపకాలను కనుల ముందు పరిచింది మీ ఈ కవిత భావన గారు

    ReplyDelete