Thursday, July 20, 2017

తెరచిన పుస్తకం

ఇదేం జీవిత ప్రయాణమో అర్థం కావడంలేదు
ఎవరైనా అర్థంకాని ఈ పొడుపుకధను విప్పండి 
అభీష్టాల్ని తీర్చే అభయం కోసమే అన్వేషణ
సాగరమన్ని స్వప్నాలున్నా కనులు బీడుబారినవి
ఇవేమి ఆశల అలలో తనలో నన్ను ముంచేస్తున్నవి 
ఇదేమి వెర్రితనమో ఇంతటి లగ్నమెందుకో తెలియదాయె
హ్రుదయం మాత్రం వెంపర్లాడుతుంది కోరికల కస్తూరికై
నింగి నుండి నేల వరకూ నా చేతులు చాచి ఉన్నాయి 
ఇది కలో నిజమో ఎవరైనా తేల్చి చెప్పండి
తెరచిన పుస్తకం చదివి బయట లోపల ఒకటని తేల్చండి..

8 comments:

  1. మీ పుస్తకం మీకే తెలియకుంటే మేము ఏం చెప్పము :)

    ReplyDelete
  2. బ్యూటిఫుల్
    ..గౌతమి

    ReplyDelete
  3. సముద్రపు అలలను చూస్తే కలిగే భావన..
    ఆ సంద్రానికే నిలకడ లేదని..
    కాని లోగుట్టు అల్ల ఒకటే..
    ఒడ్డును వీడి సంద్రం ఉండజాలదు..

    ReplyDelete
  4. అర్ధం కానందుకే ఈ వ్యర్ధ ప్రయత్నాలన్నీ...అర్ధం అయితే ఆశ్రమాలే మన ఆశ్రయాలేమో...!

    ReplyDelete
  5. కలో నిజమో తేల్చుకోవడం కష్టం :)

    ReplyDelete
  6. కష్టమే చెప్పడం

    ReplyDelete