నేను ఒక వ్యధాగీతాన్ని
నా నిండా వేదనలే నిండి ఉన్నాయి
నా ఆలాపనలో తానం పల్లవులలో
పలికేది కేవలం వ్యధలే...
స్వరకల్పన నిండుగా రసహీనతే
వినేవాళ్ళ లేరు, ఉన్నా ఓహో అనరు
గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను శ్రవణానంద పరచలేను
నా దుఃఖం సామవేదసారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు
పాడాలని అనుకున్నా పలకలేని పాటను
నేను మాత్రమే నడిచే గజిబిజి బాటను!!!
నా నిండా వేదనలే నిండి ఉన్నాయి
నా ఆలాపనలో తానం పల్లవులలో
పలికేది కేవలం వ్యధలే...
స్వరకల్పన నిండుగా రసహీనతే
వినేవాళ్ళ లేరు, ఉన్నా ఓహో అనరు
గుండెను కలిచివేయగల జీవస్వరాలు
శ్రోతలను శ్రవణానంద పరచలేను
నా దుఃఖం సామవేదసారాలు
నే సాధించలేని ఎన్నో అంశాలకు ఆకారాలు
పాడాలని అనుకున్నా పలకలేని పాటను
నేను మాత్రమే నడిచే గజిబిజి బాటను!!!
life is a travelogue, every page in it is fascinating, explore and discover every moment, for life is a once-in-a-while offer, lifetime guaranteed clause.
ReplyDeleteజీవితము ప్రకృతితో ముడిపడి ఉంటుంది
బహుబాగ వర్ణించారు భావన గారు
జీవితం అంటే ఇంతేనేమో.
ReplyDeleteబాగవర్ణించారు.
ReplyDeleteఎవ్వరూ కూడా అందరినీ సంతోషపరచలేం.
ReplyDelete