ఎదలో సవ్వడులు నీ వల్లే...
మదిలో అలజడులు నీ కోసమే
మది తాపత్రయ పడును నీ కొరకే
నిన్ను చూడాలని కనే కలలు
నీవు లేక సెలయేరైనవి కనులు
ఎదలో దాగున్న ఇష్టాలను తెలపే
ప్రయత్నం చేస్తున్నా పలుమార్లు
మన మధ్య జరిగిన ఘర్షణలని
మరి కొన్ని సరదా సంఘటనలని
ఎడబాటుని తట్టుకోలేక నీవు లేక
ఎక్కడ ఉన్నావో తెలుసుకుని
ఈ క్షణమే చెంతకు చేరాలనిపిస్తుంది!!
ప్చ్
ReplyDeleteLovely..
ReplyDeleteప్రేమిస్తే అంతేనేమో!
ReplyDeleteపచ్చమ్మాయి గారో.. హేవిటో నాకూనూ తెలిదండి!
ReplyDeleteభేషుగ్గ అలా అలా తన్మయత్వం నిండిన పదాలతో అల్లేశారు కవితను ఆసాంతం.. పద ప్రయోగ శైలి బావుంది అంటాన్నేను.