Tuesday, June 18, 2019

ఎందరు?

ఎవరెవరో అడుగుతుంటారు
ఆనందమా నువ్వు ఎక్కడ ఉన్నావని?
ఎన్ని ప్రయోగాలు ఎందరు చేసారో
ఆనందమైన జీవితాన్ని తెలుసుకోవాలని 
కళ్ళనిండా ఉన్న కలలను 
ఎన్నింటినో సొంతంచేసుకోవాలని
శ్వాసను ఎప్పుడూ ఆపక ఊపిరి పీల్చాలని 
ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసారో
ఫలించని ప్రయత్నాలతో ఎందు అంతమైపోతున్నారో     

3 comments:

  1. ఆనందమనేది కేవలం మానసిక పరిపక్వతతో కూడుకున్నదని అనుకుంటే లోకంలో వ్యథలకు తావిచ్చినట్లు భావించవచ్చునా..

    అసమానమైన మానవజన్మ మరలి రాదు కదా..
    రెప్పపాటులో ఎన్నెన్నో భావాలు భావోద్వేగాలు అతలాకుతలం
    మనఃశాంతి కొరవడి మనిషి కృంగితే ధైర్యం చెప్పకా దెప్పిపొడిచేవారే ఎక్కువా
    ఎదుటివారి క్షోభను అర్దం చేసుకుని మసలుకుంటే నిత్యమై అలరారు ఆనందానికి అవధులే కరువాయేను కాదా
    మోడువారిన జీవితమే పచ్చగా చివురులు తూడిగే.

    ~ధరణి

    ReplyDelete
  2. "శ్వాసను ఎప్పుడూ ఆపక ఊపిరి పీల్చాలని
    ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసారో
    ఫలించని ప్రయత్నాలతో ఎందు అంతమైపోతున్నారో"

    HATS OFF!

    ReplyDelete