Sunday, February 23, 2020

నీ తోడుగా

పోగుచేసి పొందుపరిచిన ఎన్నో భావాలను 
నీతో పంచుకుంటూ నీ ఎదపై వాలిపోతాను 

చెల్లాచెదురై చెరిగిపోయిన నా చిరునవ్వును 
నీ చెలిమిలో చిత్రించి చిందులు వేయిస్తాను

ఒంటరితనం నా తోడని వెంటపడినా వెళ్ళను
నీ ఊహలతో ఊసులే చెబుతూ గడుపుతాను 

నిద్దుర రాక చచ్చిపోతున్న ఆకలి దప్పికలను
నీ జ్ఞాపకాల అరలలో అపురూపంగా దాచాను

గుండెల్లో అపురూపంగా దాచుకున్న కధలను 
నీ పరకరింపులతో పరామర్శిస్తూ ఉంటాను..   

3 comments:

  1. మీ తోడూ నీడ బాగుందండీ.

    ReplyDelete
  2. పచ్చా పచ్చని మామిడాకు తోరణాల్లాంటి కవితలతో ముచ్చట గొలిపే తెలుగమ్మాయి గారు
    భావాలన్ని మది మాటున దాగుంటే వాటికి
    అక్షర రూపాన్నిచ్చి ఏకరూపు పెడుతున్న చంచల తెలుగమ్మాయి గారు.

    ReplyDelete