ఊహాల్లో నేను నీతో విహరించిన వీధులు చూపిస్తా
స్వప్నలోకంలో నీతో సాదించే సరసాలు వివరిస్తా
నీ అందాన్ని అభివర్ణిస్తూ వ్రాసిన కవితలు వినిపిస్తా
నీ నిండైన రూపానికి గీసిన ప్రతిరూపాలు చూపిస్తా
నీ విరహంతో రగిలిన కార్చిచ్చులను చూపిస్తా
నీ ఎడబాటుతో కారిన కన్నీటి కడలిని చూపిస్తా
నీ అభిషేకం కై పెంచిన పూలతోటలు చూపిస్తా
నీ ఆరాధన కోసం కట్టిన పొదరిల్లులు చూపిస్తా
నావెంట రా ప్రేమసాగరం లోతుల్ని చూసేద్దాం!!
నిటూర్పు ఎడబాటును దెలిపే
ReplyDeleteనిరాశ నిశ్పృహలను దెలిపే
ఆశల ఊబిలో కోరికల ఊట
తెలిసి తెలియని మనషుల ఆట
విప్లవ వలపు గీతిక
సలీల సరసు కేతిక
~శ్రీత ధరణి
meru malli vrayalani manavi.
ReplyDelete