Monday, March 18, 2013

హృది వీధిలో...

నా  హృదయ వీధిలో విహరించే ఓ తీయని ఊహా
నా కళ్ళలో ఓ కమ్మని కలగా నిదురించ రావా....

నా గొంతు పలికే ప్రతి అక్షరం నీ నామమే కదా
నా ఊహాలతకి ఊపిరినీయ పరుగున నను చేరవా....

నా భావోధ్వేగాలని నియంత్రించే యంత్రానివి నీవు
నా కవిత ఆది అంత్యాల మధ్య ఖాళీని పూరించవా....

14 comments:

  1. ఓ తెలుగమ్మాయి,
    ఖాళి ని వదలకుండా పూరించమని ఊరిస్తే మీ తెలుగబ్బాయి ఎలా పూరిస్తాడు ?
    చిట్టి కవిత కాస్త పెద్దది అయితే ఇంకా బాగుంటుందనుకుంటా ...
    గుడ్ వన్ !!

    ReplyDelete
  2. బాగుంది, చిన్ని కవితే అయినా అందులో ఒదిగిన భావం.

    ReplyDelete
  3. భావం బాగుంది.

    ReplyDelete
  4. ఊహ విహంగనమై విరహానికి నీకోసం బయలుదేరింది
    కమ్మని గానం నీటపలికిన వెంటనే హృదయం పొంగింది
    బరించలేని బావోగ్వేగం...యుగ యుగాలుగా నీకోసం తపిస్తోంది
    ఎంత నీకోసం రాసినా అన్నీ ఖాలీలే కనిపిస్తున్నాయి కాస్త పూరించవూ

    ReplyDelete
  5. మీరింతందగా పిలిస్తే రాకుండా ఉంటారా చెప్పండి :)

    ReplyDelete
  6. చాలా బావుంది 'తెలుగు అమ్మాయి' గారు మీ ఉహాలను స్వాగతించే కవిత......-:)

    ReplyDelete
  7. తెలుగు అమ్మాయి మది దోచే అచ్చ తెలుగమ్మాయే సుమండీ... భావ వ్యక్తీకరణ సుమధురం. అక్షరాభివందనాలు.

    ReplyDelete
  8. అందమైన అమ్మాయి మదిలొ మనసుకందని భావాలుంటాయా మరి

    ReplyDelete
  9. తెలుగమ్మాయి అంత అందంగా ఉంది..

    ReplyDelete
  10. హృది వీధిలో...కవితే కాదు శీర్షిక కూడ ...beautiful

    ReplyDelete