1/2మనసు
భాధే బాగుందన్న భ్రమలో ఉన్నాను
మరణాన్ని చేరబోయి నీకు చేరువైనాను
మౌన తీరాన్ని నీవు నాకు చూపావు
నా కంట కన్నీటి కెరటాలని తెప్పించావు
పైకి కనపడని గాయం భాధ పెడుతుంది
హృదయం సగమే నా దగ్గర మిగిలుంది
ఆ సగమైన మనసు మరోసగాన్ని కోరింది
నా మనసే నన్ను వెలివేసి జీవఛ్ఛవమైంది!
హృద్యంగా ఉంది కవిత.
ReplyDeleteమిగిలిన సగం లోనూ ఉన్నది ఆ వెలి(వే)సిన మనసేగా?
నా కంట కన్నీటి కెరటాలని తెప్పించావు..
ReplyDeleteఆ సగమైన మనసు మరోసగాన్ని కోరింది ..( ఉప్పెనలా మారకముందే .. ఆ సగం ఇచ్చేస్తే బాగుంటుంది ... హెచ్చరిక )
అందంగా , సున్నితంగా ..బాగుందండి
మిగిలిన 1/2 భాగం ఎవరిదో? :)Nice feel
ReplyDeleteమరణాన్ని చేరబోయి నీకు చేరువైనాను
ReplyDeleteమౌన తీరాన్ని నీవు నాకు చూపావు
నా కంట కన్నీటి కెరటాలని తెప్పించావు,,,,,,,,,,> గుండెను పిండేశారు భాదను ఇలా కూడా వ్యక్తం చేయవచ్చన్న మీ భావన అద్బుతం మదిలో భావాన్ని సున్నితంగా సురకత్తుల్లాంటి పదాలతో చెప్పారు ఎంతైనా అచ్చమైన తెలుగమ్మాయివి కదా బాగుందండీ మీ కవిత
భాధే సౌఖ్యమనే భావనలో......బాగుంది
ReplyDeleteఆ సగమైన మనసు మరోసగాన్ని కోరింది
ReplyDeleteచాలా అర్ధవంతంగా వుంది .
నీ తియ్యని మాటల గారడీలో
ReplyDeleteనీ అందమైన పెదవుల
మద్యి నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన కను రెప్పల వెనుక
ఆవిరయిన ఆశ క్షణాలనూ..
నీకోసం ఇప్పటి ఎదురు చూస్తూ
నలిగిపోయిన క్షనాలను
ఎన్నని లెక్కబెట్టుకోను
నా భాద ఎవరికి చెప్పుకోను ప్రియా
చాలా బాగుంది.
ReplyDeleteమనసు పలికే బాధను మౌనాక్షరాలతో లిఖించారు..Nice...
ReplyDelete