Sunday, July 21, 2013

నా ఊపిరి

కొంత మంచి మరింత మొండివాడివి
ఎలాంటివాడివైనా నీవు నావాడివి
కొంత అల్లరి మరింత అసూయపరుడివి
నా శింగారానికి కారణమైనోడివి
కొంత తెలివైన మరింత తిక్కా ఉన్నోడివి
ఏదోలా నా మనసు దోచిన వాడివి
కొంత నిజానివి మరింత కలల అలజడివి
నాలో దాగిన నా నమ్మకానివి
కొంత కొంటెతనం మరింత కోరినవాడివి
ఎందుకంటే నీవు నా నిరీక్షణవి
కొంత ప్రియం మరింత పౌరుషమున్నోడివి
నన్ను వలచి నాకు నచ్చినోడివి
కొంత రసికుడివి మరింత రాక్షసుడివి
ఏమైనా నేను శ్వాసించే ఊపిరివి

8 comments:

  1. చిలిపిగా అయినా చక్కగా చెప్పావు ;-)

    ReplyDelete
  2. ఆహ్లాదంగా ఉంది ...

    ReplyDelete
  3. హమ్మయ్య....ఊపిరి అంటే వదిలిపోలేవుగా :) సో నైస్

    ReplyDelete
  4. మొండి వాడినే కాని మోసగాడిని కాదు
    నీవాడీనే కాదు నీనీడనుకూడా
    నిన్ను మనసులో దాచుకొని మనసును దోచానని
    దొంగ అన్నా పర్లేదు... ఎందుకంటే దొంగను కాబట్టీ
    రసికున్నే నీదరి చేరకుంటే రాక్షసున్నైవుతా..
    ఒంటరి తనపు రక్కసి కౌగిలిలో చిక్కుకపోయా
    అక్కడ నీవూపిరికే ఇక్కడ నా గుండె కొట్టుకుంటోంది
    లేదంటే ఎప్పుడో ఆగిపోయేదేమో కదా .............>
    Telugu ammi garu... mee kavitaku kounter ga rayaalani vifala prayatnam chesanemo kadaa.. kani edo neela ratalakapoyinaa.. pratispndana kavita raayalani pinchindi.. ఎదైనా తప్పుగా రాస్తే క్షమించగలరు Meeru chala baga rasaru Nice Feel Andi

    ReplyDelete
  5. అనికేత్ గారు అన్నట్టు ఊపిరి అంటే వదిలిపోలేవుగా :) బాగుంది

    ReplyDelete
  6. chala baVUNDI TELUGAMMAYI LO NI KONTETHANAM ,AMAYAKATHVAM..SOUNDARYAM...ANNI MI KAVITHA LO KANIPISTHUNNAYI...
    -SARADA

    ReplyDelete
  7. ఇలా తెలుగుతనంతో ఆకట్టుకోవడం బాగుంది.

    ReplyDelete
  8. మాబాగాచెప్పావు అమ్మాయ్ ;-)

    ReplyDelete