Sunday, August 18, 2013

ఇదేం ప్రేమో!

అందరికీ అందుబాటులో ఉంటావు
నాకుమాత్రం అందకుండా పోయావు

అందరిపై కారుణ్యాన్ని చూపుతావు
నా కళ్ళలో ప్రేమనుమాత్రం చూడవు

అందరి గుండెలయలకర్థం చెబుతావు
నా గుండెఘోషనెందుకో వినకున్నావు

అందరితో పరిచయాలు స్నేహమంటావు
నా పరిచయమొక్కటే నీకు వింతంటావు

అందరికీ అర్థమై నాకు అర్థంకాకున్నావు
ఇదేమిటంటే ప్రేమంటే ఇదేనని అంటావు!

7 comments:

  1. well said.beautiful expression

    ReplyDelete
  2. అందుబాటులో ఉంటూ అందకుండా పోవటం ,
    కారుణ్యాన్ని చూపుతూ , ప్రేమను చూడలేకపోవటం ,
    గుండె లయలకర్ధం చెపుతూ , ఘోషను వినకపోవటం ,

    (ఘోష భాషలో భావంలో పరాకాష్ట కదా!)

    అందరితో పరిచయాలు స్నేహమంటావు ,నా పరిచయమే నీకు వింతంటావు .

    అర్ధమై , అర్ధం కాకుండా ఉండటమే ప్రేమని బహు చక్కగా నిర్వచనం చెప్పటం వాస్తవికతకు అద్దం పట్టినట్లుంది .

    మా తెలుగమ్మాయి మనసుని బాగా పరిశీలించటం చాలా చాలా బాగుంది .

    ReplyDelete
  3. ప్రేమపై PhD చేస్తున్నారా తెలుగమ్మాయిగారు :)

    ReplyDelete
  4. Ontari Jeevitam lo Tuntari Talapulu Teppinche Premanu Mee Kavitalo manchi nirvachanamichchaaru Telugammayigaaru.. Bahuchakkagaa undi.. :)

    ReplyDelete
  5. Raagadweshaalu Bhaavaalu Oohalu anni kalagalipi raasinattunnaru.. Baaga Pandindi "Gongura" sorry "Gorintaaku" laanti kavita..!

    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  6. అవ్యక్తానుభూతైన ప్రేమను ఇలా కవిత్వీకరించి హృద్యంగా తెలుపడంలో మీదందెవేసిన చేయి తెలుగమ్మాయి గారూ... beautiful expression.. Congrats...

    ReplyDelete
  7. "అందరికీ అందుబాటులో ఉంటావు
    నాకుమాత్రం అందకుండా పోయావు"

    మరి కాదా అదనంత దూరంలో ఉంటేనే కదా అందుకోవలని చూస్తావు పక్కనే ఉంటే అందుకోవలన్న ఆత్రం ఉండదని....అదరితో ఉన్నా పలుకులవరికే వాళ్ళు ...
    "అందరి గుండెలయలకర్థం చెబుతావు
    నా గుండెఘోషనెందుకో వినకున్నావు"

    ఆ గుండె ఘోషలోనే కదా నా మనసు భాష నీకు తెల్సేది..మరి అందరిలాగా నేనుంటే " మనం " అన్నదారికి అర్దం ఏముంది

    "అందరిపై కారుణ్యాన్ని చూపుతావు
    నా కళ్ళలో ప్రేమనుమాత్రం చూడవు"

    ప్రతిక్షనం నా ఉలికిపాటుకు కారణం నీవేకదా..నీ గుండే ఘోషలో నన్ను నేను వెతుకునేందుకే అని శాశ్వితంకాదు అని నీ మనసుకు తెల్సు నీకో చిన్న పరిక్ష..

    "అందరికీ అర్థమై నాకు అర్థంకాకున్నావు
    ఇదేమిటంటే ప్రేమంటే ఇదేనని అంటావు!"

    మరి అందరిలా నీవైతే నీవూ నేనూ "మనం" ఎందుకౌతాము అర్దం చేసుకునే అపార్దంలో మిగిన అద్దాన్ని నేను రోజు నీవు అద్దంలో చూసుకొంటే నీవు కనిపిస్తున్నావా నేను కనిపిస్తున్నానా ...హ్మ్ నేనే కదా మరి అదేకదా "ప్రేమంటే " Telugammai Jest saradaga Mee kavitaku Counter Tri chesaaa...saradaga Teesukondi (మీరు సందించిన ప్రశ్నకు సరదాగా ఇచ్చిన సమాదానాలు " తప్పైతే క్షమించండి " తెలుగమ్మాయి గారు )

    ReplyDelete