విశాల గగనంలో విహరించాలని....
గుప్పిట్లో ఆకాశాన్ని బంధించాలని
అనుకుంటూ ఊహల విహంగమై ఉంటే
నా మనసుని అందరూ చదివేస్తున్నారు
ఇంక నేను విరహాన్ని ఎలా వివరించను
వ్యధను అస్సలు ఇంకేం వ్యక్తపరచగలను?
*****
నీ మాటలు కరువై మనసు బరువై....
జీవనసారమేదో కరువై జీవితమే దిగులై
క్షణాలన్నీ యుగాలుగా మారి బోధిస్తుంటే
వినిపించదు ఏ జ్ఞానం నీవు నా కంటపడక
రెప్పలకు కునుకేమివ్వను నిన్ను చూసేదాక
యుగళగీతం ఏం పాడను సోలోగా మిగిలాక?
గుప్పిట్లో ఆకాశాన్ని బంధించాలని
అనుకుంటూ ఊహల విహంగమై ఉంటే
నా మనసుని అందరూ చదివేస్తున్నారు
ఇంక నేను విరహాన్ని ఎలా వివరించను
వ్యధను అస్సలు ఇంకేం వ్యక్తపరచగలను?
*****
నీ మాటలు కరువై మనసు బరువై....
జీవనసారమేదో కరువై జీవితమే దిగులై
క్షణాలన్నీ యుగాలుగా మారి బోధిస్తుంటే
వినిపించదు ఏ జ్ఞానం నీవు నా కంటపడక
రెప్పలకు కునుకేమివ్వను నిన్ను చూసేదాక
యుగళగీతం ఏం పాడను సోలోగా మిగిలాక?
గగనం లో విహరించాలని కన్న కలలన్నీ కల్లేదురుగా కన్నీరుగా మారిన క్షనాలకు కారనాలు వెతికి ఏం లాభం ఇద్దరి అనుబందం వేదనగా మారి వ్యదగా గుండెను కొస్తున్న జ్ఞాపకాల కత్తులకు బలౌతూనే ఉన్నా కదా విరహ వేదనలో నీవు చేసిన జ్ఞాపకాల కత్తి పొట్ల గాయాలు తడుముకొంటున్నా తప్పో తప్పని సరైన పరిస్థితులు కాదనుకున్న నిజాల సాక్షిగా..చేయని నేరానికి బలైన ప్రేమను ఆదరించలేని నీ నిస్సహాయతలో మాటలు కరువై ..జీవితం బరువై గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్న దుక్కానికి కారనం నీవైనా ...అది నేను మాత్రమే బరిస్తున్నా .. నీ ఆనందానికి అడ్డుగా ఉండకూడదని నన్ను నేను అడ్డంగా కరుగదీరుకుంటున్నా కొవ్వొత్తిలా అయినా కరుగలేని నీ మనస్సాక్షిగా
ReplyDeleteరెప్పలకు కునుకేమివ్వను నిన్ను చూసేదాక
ReplyDeleteయుగళగీతం ఏం పాడను సోలోగా మిగిలాక? cute feel..
ఇంతటి వ్యధ ఏల తెలుగు బాలా ? :)
ReplyDeleteVery very nicccee.. Kavitha chaalaa andamgaa undi..:-):-)
ReplyDeletemee blog introduction chaalaa chaalaa baagundi... :-):-):-)
తెలుగు అమ్మాయిగారికి, నమస్కారములు.
ReplyDeleteకవిత భావయుక్తంగా వున్నది.
మీ స్నేహశీలి,
మాధవరావు.