Tuesday, November 5, 2013

నాకిష్టం

ఎవరినీ కష్టపెట్టకూడదు అన్నదే నాకు ఇష్టం
నా వేదనా సామ్రాజ్యానికి మహారాణిని నేను
పరుల ఆనందం పంచన చేరే అనుభవంలేదు

అందరూ నవ్వుతూ ఉండాలన్నదే నా కోరిక
ఎదుటివారికి చెడును ఎన్నడూ నేను కోరను
ద్వేషాన్ని నాటి నీరుపోసి పెంచడం నాకురాదు

ఇతరుల కొరకు  ఎంతటి త్యాగానికైనా నే సిధ్ధం
వేరొకరికి కీడెంచి శాపాలతో జీవిస్తూ బ్రతకలేను
పొరపాటునైనా మనసు నొప్పించడం నాకురాదు

10 comments:

  1. మరీ ఇంత సున్నితమా :)

    ReplyDelete
  2. ఇలా ఇతరులకోసం అయితే త్యాగశీలిగా మిగిలిపోతావు అంతే :-)

    ReplyDelete
  3. త్యాగశీలివమ్మా అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేస్తారు తెలుగమ్మాయి గారూ .. :-)
    కాస్తా మీ గురించి ఆలోచించండి..

    ReplyDelete
  4. ఇలాంటి భారమైన డైలాగ్స్ అవసరమా మీకు :-)

    ReplyDelete
  5. కొన్ని జీవిత అనుభవాలు తరచిచూస్తే గానీ అసలు నిజాలు తెలీవేమో...?

    ReplyDelete
  6. గతం నాకేసి జాలిగా చూస్తూ
    తడి చూపులలో నన్ను తడిపేస్తున్నాయి
    గతించిన కాలం వెక్కిరిస్తూ సాగనంపుతుంది
    గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది
    నీవు అనే గతం ప్రస్తుతాన్ని మింగేసి ఒంటర్ని చేసింది

    ReplyDelete
  7. మీ లాంటి వారి బాధ పెట్టాలనుకున్నా.. పెట్టలేరులెండీ...

    ReplyDelete
  8. Telugu Ammayi gariki

    Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.

    Telugammayi madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.

    Telugammayi madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.

    http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

    Telugammayi madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

    Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

    Telugammayi madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

    Telugammayi madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.

    ReplyDelete
  9. ఇంతటి కల్తీ ..గల్తీలు లేని మా తెలుగమ్మాయి అమాయకతను చూస్తుంటే జాలే .
    గుండెను కరిగించే మా తెలుగమ్మాయి కవిత కాస్త కలవరపరిచింది
    - శ్రీపాద

    ReplyDelete