Monday, November 11, 2013

మనసు మనసుతో

మనసు మనసుతో అన్నది బాసచేయమని
ఎక్కడున్నా ఎన్నటికీ నన్ను మరచిపోవద్దని
ఋతువులెన్ని మారినా నీవు మారిపోవద్దని


ప్రేమమార్గంలో జంటగా నిన్ను తోడు రమ్మని
ప్రశాంతంగా ఉండనీయని ప్రేమకోరింది ప్రేమని
జీవితమే నీదని తెలిసడిగింది జీవంపోయమని


దూరమెంతైనా వెళ్ళినంత వేగిరం తిరిగిరమ్మని
ఇదిగో అదిగో అని మాటలతో మభ్యపెట్ట వద్దని
పగలైనా మబ్బేసినా వెన్నెలరేయైనా రారమ్మని 


ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి పెట్టి ప్రేమించమని
ఓ జ్ఞాపకమా మనసావాచా మరచిమారిపోవద్దని



8 comments:

  1. మనసు మనసుతో అన్నది బాసలు నిలుస్తాయి
    ఎన్నటికీ నన్ను మరచిపోవద్దని అడిగి అడిగి అలసిపోయాను
    ఋతువులెన్ని మారినా నీజ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే

    ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి పెట్టి ప్రేమ ఎప్పుడూ పదిలమే
    నిప్పునీరు ఏవ్వరూ ఏంమీ చేయలేరు .. కుతంత్రాలు చేసే మనిషి తప్ప
    ఓడిపోయేలా చేసి వాడిపోయేట్టు చేసిన మనషి ఆడిన నాటకంలో
    సమిదగా మారింది ప్రేమ ...చివరకు జ్ఞాపకమై గుండెల్లో నిలచిపోయింది
    అందుకే ఓ జ్ఞాపకమా మనసావాచా మరచిమారిపోవద్దని వేడుకొంటున్నా


    దూరం కాలేదు ... దగ్గరి తనం పక్కకు జరిగింది అంతే
    మనసు మాటున మాటలు మూగబోయాయి
    మదిచేరువలో ఉండాల్సిన మనం విడిపోయాము
    కాదు కాదు విడదీసింది కలికాలం ..
    అది కలకాలం ఉండాకూడాదని నా తపన


    ReplyDelete
  2. Nice rhymic style....Good flow of words..

    ReplyDelete
  3. మనసు మనసు మాటలు బాగున్నాయి

    ReplyDelete
  4. ఇన్ని అందమైన మాటలా మనసుతో :)

    ReplyDelete
  5. బాసల జ్ఞాపకాలు తీరం దాటితే..... భాదే !
    మరి అలాంటప్పుడు " మనసు మాటున మాటలు
    మూగబోకుండా' ఎలా ఉంటుంది .
    కవిత కాస్తా కదిలించింది.
    - శ్రీపాద

    ReplyDelete
  6. Very nice telugammayi gaaro:-):-)

    ReplyDelete