రోజూ నువ్వునాతో ఎందుకు ఉండవంది
ఊసులు ఎన్నో చెప్పి మాయమౌతావని
అయినా నీకే మనసిచ్చానని గేలిచేస్తుంది
వినిపిస్తున్న గుండెఘోష నీదానాదా అంది
మెరిసేతారను తోకచుక్క చేసి రాలనీకంది
గాయపడ్డమది ముట్టుకుంటే మసౌతుంది
మరచిపోయి మరోగాయంచేసి నన్నుతాకితే
గమ్యంలేని గాలినై ధూళిలో కలిసిపోతానంది
నాప్రేమపుట్టుక నీపేరుతోటే ఆది అంతమంది
చిన్ని చిన్ని చిలకపలుకుల్ల ముద్దు ముద్దు భావాలు బాగున్నాయి
ReplyDeleteగుండెసవ్వడి ఎందుకో గుబులు గుండెల్లో చేరినప్పటినుంచి దిగులు
ReplyDeleteదయలేని దానివైయ్యావు కాబట్టేనేమో .. దారితెలియక తిరుగుతున్నా
ఎన్నో ఊసులు ఎన్నో చెప్పి మాయవివి
మాయచేసి గేలి చేస్తుంటే.. మనసు నిలవనంటుంది
వినిపిస్తున్న గుండెఘోష నాదైనా నీదై భాద ఇద్దరీకద...?
నా మనసులో మరచిపోయి గాయం చేసి ఒంటర్నిచేశావు
గమ్యంలేని గాలినై ధూళిలో కలిసిపోతున్నా నిప్పుడు
నాప్రేమపుట్టుక మరణంకోరకే అన్నట్టుంది మరుపనేది లేదే మనసా
లిపీ ప్రేమలో మరీ ఇంత వైరాగ్యమెందుకు :-)
ReplyDeleteమీ విరహ గీతం అద్భుతమండీ తెలుగమ్మాయి గారు.. అభినందనలు..
ReplyDeleteమరచిపోయి మరోగాయంచేసి నన్నుతాకితే
ReplyDeleteగమ్యంలేని గాలినై ధూళిలో కలిసిపోతానంది....చాలా బాగుంది లిపి
ఏంటండి ఇదంతా ప్రేమేనా
ReplyDeleteఅంతా పచ్చదనమే పైరుగాలి, పదహారణాల పిల్లకూడా :-)
ReplyDeleteలిపి సూపర్:-)
ReplyDeleteనాప్రేమపుట్టుక నీపేరుతోటే ఆది అంతమంది..........excellent expression .
ReplyDeleteతెలుగమ్మాయి అంటే, నిజంగా ... మరి మా తెలుగామ్మయిలానే ఉంది ఆ రచనా వ్యాసంగం ముద్దుగా.
ReplyDelete" ఊసులు ఎన్నో చెప్పి మాయమౌతావని
అయినా నీకే మనసిచ్చానని గేలిచేస్తుంది
వినిపిస్తున్న గుండెఘోష నీదానాదా అంది"
- మాటలతో అల్లిన ఈ మాల ఎంతో ఆకట్టుకుంది .
ఈ ప్రయాణం ఇలాగే సాగనీ
'మా తెలుగమ్మాయీ ' ......
- శ్రీపాద
ఊసులు ఎన్నో చెప్పి మాయమౌతావని
ReplyDeleteఅయినా నీకే మనసిచ్చానని గేలిచేస్తుంది
వినిపిస్తున్న గుండెఘోష నీదానాదా అంది...బాగుంది అమ్మాయి
మరచిపోయి మరోగాయంచేసి నన్నుతాకితే
ReplyDeleteగమ్యంలేని గాలినై ధూళిలో కలిసిపోతానంది
నాప్రేమపుట్టుక నీపేరుతోటే ఆది అంతమంది chalaa chaalaa bagundi:-):-)