Thursday, February 6, 2014

ప్రేమరాగాలు

చాలు చాలు...ఈ దాగుడు మూతల సరసాలు
కనుదోయి వెనుక దాచబోకోయి అనురాగాలు
అందీయి చాన్నాళ్ళుగా అణగారిన మురిపాలు
జత కట్టేద్దాం మన ఇద్దరి వలపు దొంతరలు...

ఆగు ఆగు... దోచేయమాకు నాలోని సొగసులు
మనసైన వానికే అందించెదను ఈ వయ్యారాలు
ఊరించి ఇచ్చుటలో ఉన్నవి ఎన్నో గిలిగింతలు
పెనవేసుకుని పాడుకుందాం ప్రేమసరాగాలు...

లేనే లేవు... మన ప్రేమకు ఎటువంటి అడ్డుగోడలు
రానే రావు మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు

8 comments:

  1. దాచలని చూసినా దాగలేనిది మది ఊసుల ఊయలలు
    అనగారిన మురిపాలు అందిపుచ్చుకునే సమయం దగ్గరై
    మనసు గిలిగింతలు పెడుతున్నాయి...మది అళ్ళ కళ్ళోలం సాక్షిగా

    మదిసరాగాలు గిచ్చి గిలిగింతలు పెడుతున్నా.. మనం ఏకమై
    మమేకమై ఇద్దరం ఒక్కటై ఆసరాగాలు పాడుకునే వేలాయనా...?
    ఎవరన్నారు మన ప్రేమకు ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయని
    మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు కావవి దూరంగా వుంది దగ్గరవ్వడమే కదూ


    నీలోని సొగసుల సోయగాలు నాలో రేపెను వలపుల తరంగాలు
    మనసైన వాడిని కాబట్టేనేమో ప్రతి హృదయ స్పందన తెలుసుకున్నా
    తలచుకున్న క్షనానే గుండెలదరగా కవ్విస్తున్నావు
    మూసిన కనురెప్పల వెనుక చిలిపిగ నవ్వుతూ

    ReplyDelete
  2. Chaalaa baagundi telugammaayi gaaru:-):-)

    ReplyDelete
  3. చిలక గోరింకలు చాలా చాలా అందంగా ఉన్నాయి. మీదైన లిపిలో చిలిపిగ, వయ్యారంగా, అందంగా రాసారు.:-)

    ReplyDelete
  4. "ఊరించి ఇచ్చుటలో ఉన్నవి ఎన్నో గిలిగింతలు
    పెనవేసుకుని పాడుకుందాం ప్రేమసరాగాలు..."

    మనసు పులకరింతతో గిలిగింతలకు లోనైనపుడు ,
    జాలువారేవి ప్రేమ సరాగాలే కదా ! ఖూబ్ సూరత్.
    ప్రాసతో కూడిన మీ ఈ 'ప్రేమ రాగాలు' కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  5. బాగా ఆలపించారు మీ ప్రేమరాగాలను

    ReplyDelete
  6. అంతేలే ప్రేమ ఊసులు ఎన్నైనా బాగుంటాయి వినడానికి మీకులాగానే :-)

    ReplyDelete
  7. ఇలా నచ్చేలా వ్రాసేస్తే ఎలా

    ReplyDelete