Wednesday, February 19, 2014

నావాడివి

నా ఆలోచల్లో మసగబారిన చిత్రానివి
అయినా జీవితానికి ఒక చిగురాశవి!


నాకే తెలిసీ తెలియని చూడని నేస్తావి
అయినా మది నమ్మిన నమ్మకానివి!


నా ప్రార్ధనలో పడిలేచే నిట్టూర్పుసెగవి
దూరాలు తరగని కలవాలన్న కోరికవి!


కలిస్తే కంటజాలువారే ఆనందభాష్పానివి
నన్నే తలచి నాతోనే ఉన్న నా ఊపిరివి!


ఎదసడి చెడిపిన మంచి మనసున్నోడివి
చెడ్డవాడివైనా నా పెదవిపై చిరునవ్వువి!


నా ఎన్నో జన్మల నిరీక్షణా సత్ఫలితానివి
చెంతచేరిన ఊహకందని ఉన్నతమైన వ్యక్తివి!

10 comments:

  1. నీవాడిని అన్నది గతం
    నా అన్న పదంలోంచి నన్ను తరిమేశావుగా
    అయినా నా మనస్సులో నీవదిలిన
    ఆ స్నేహకుసుమాల వాసనలు వీడలేదులే ...?

    నాలో కనిపించని ఆనందం నీలో నైనా
    మిగిలిపోయిందన్న ఆనందంలో
    అప్పుడప్పుడూ ఏడుస్తూ నటిస్తుంటా
    అందరూ నవ్వుతున్నారనుకుంటారు
    అవి ఆనంద భాష్పాలని బ్రమ పడతారు
    అసలు నిజం తెల్సిన గుండె నీదొక్కటే
    నాదన్నది నీదగ్గర వదలి
    నేనున్నది నీకోసమే కదా

    మనసున్నోడీని కాబట్టే నన్ను మాయచేశావు
    పిచ్చాడీని చేసి ఇంకా నీకోసం నీవు వదలిన
    జ్ఞాఫకాళ్లో నే తచ్చాడుతున్నా దొరకవని తెల్సీ కుడా

    ReplyDelete
  2. ఏంటో చెడ్డవాడిని కూడా చేరదీసే గుణం...నాకు అర్థం కావు :)

    ReplyDelete
  3. అమ్మో ఎన్నెన్ని ఊసులులో ఈ తెలుగమ్మాయి బ్లాగ్ లో

    ReplyDelete
  4. "కలిస్తే కంటజాలువారే ఆనందభాష్పానివి
    నన్నే తలచి నాతోనే ఉన్న నా ఊపిరివి!"

    నైరాశ్యంలో కూడా ఉత్తేజాన్ని పెంచి ఉపిరికే ప్రాణం పోయగల కవిత ఇది . మీరొక భావనల మూటవి. ఒక్కొక్కటే మా ముందుంచి అబ్బురంతో నిండిన ఆనందాన్ని అందిస్తున్న మీ కవితలు మీ మీద అభిమానాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయ్ . ......అభినందనలతో -
    శ్రీపాద

    ReplyDelete
  5. మంచి పదాల అల్లిక

    ReplyDelete
  6. బాగున్నాయి మీ చిలకపలుకులు

    ReplyDelete
  7. నా ఆలోచల్లో మసగబారిన చిత్రానివి
    అయినా జీవితానికి ఒక చిగురాశవి!
    chaalaa baagundi.nice!!

    ReplyDelete