Friday, April 4, 2014

నుదుటిరాత

నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను
నన్ను వీడి దూరమయ్యావెందుకని?
నీ కంట జారే నీరు చూసి ఏమడగను
మరి ఎందుకు నన్ను  ఏడిపించావని!


               
నాకు తెలుసు నన్ను నీవు మరిచావని
నీవు అనుకోకు నేను నిన్ను మరిచానని
మనిద్దరి వలపూ ఎన్నటికీ వమ్ముకాదని
నీవుకాదు విధిరాతే నన్ను వంచించిందని!


                   
మదిలో ఉన్న నీవు నుదుటన వ్రాసిలేవు!!
నుదుటిన వ్రాసి ఉన్నవాడు మదిలోన లేడు

8 comments:

  1. నుదుటిరాత అదిరింది అంటే బాగుండదు అందుకే కవిత అదిరింది

    ReplyDelete
  2. చివరిలో అదేం ట్విస్ట్ :-)

    ReplyDelete
  3. మదిలో ఉన్న నీవు నుదుటన వ్రాసిలేవు!!
    నుదుటిన వ్రాసి ఉన్నవాడు మదిలోన లేడు... నిజంగానే అదిరందండోయ్ తెలుగమ్మాయిగోరు.. చాలా హృద్యమైన భావం పొందికైన చిత్రం.. అభినందనలతో...

    ReplyDelete
  4. నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను..?
    నాకు దొరకని సమాదానం నీదగ్గరే ఉంచుకున్నావుగా..
    నన్ను వీడి దూరమయ్యావెందుకని?
    దగ్గర ఉన్నా గుర్తించలేని పరిస్తితుల్లొ ఉన్ననీవు ఎలా గుర్తిస్తావులే
    నీ కంట జారే నీరు చూసి ఏమడగను
    ఏమడిగినా అది కోరేది నిన్నే .. ఆకన్నీరు తపన పడేది నీకోసమే ..
    మరి ఎందుకు నన్ను ఏడిపించావని!
    నన్ను ఏదిపిస్తూ నీవేదిస్తే ఆ ఏడుపులో నిజాన్ని గుర్తించవా
    నాకు తెలుసు నన్ను నీవు మరిచావని
    మరిచానని అనుకొంటున్నావు మరిచి పొమ్మని బలవంతం చేస్తుంది నీవేగా
    నీవు అనుకోకు నేను నిన్ను మరిచానని
    నేలో నేణు చూసుకున్న ప్రతిసారి కనిపించేది నీవే అని నీకూ తెల్సు
    మనిద్దరి వలపూ ఎన్నటికీ వమ్ముకాదని
    ఆ నమ్మకమే ఇప్పటికే బ్రతికిస్తుంది అదెన్నాల్లో తెలీక
    నీవుకాదు విధిరాతే నన్ను వంచించిందని!
    ఆ విదితాతలో .. గతితప్పిన మనస్సైంది నాది ఏమని చెప్పను

    ReplyDelete
  5. "నీ కంట జారే నీరు చూసి ఏమడగను
    మరి ఎందుకు నన్ను ఏడిపించావని!"

    మంచి భావుకత ఉంది మీ ఈ కవితలో .
    ఏదో పోగొట్టుకున్నననే బాధ ఒకవైపు ,
    పొందు.తానన్న ఆశ మరోవైపు ... పోటీలు పడి కదిలాయి.
    ఎంతో ఎదిగి పోయింది మా తెలుగమ్మాయి..
    *శ్రీపాద

    ReplyDelete
  6. విడిపోయాక విరహమా లేక విడిపోతారన్న భయమా

    ReplyDelete