Sunday, May 25, 2014

మనకోసం మనం

అంబరం అంచుల్ని తాకాలనికాదు నా ప్రయత్నం

హృదయపు గదిలో కొలువుండాలన్నదే ఆశయం

గడచిన గతాన్ని మరచి జ్ఞాపకాల జాబితాలో చేర్చి

గమ్యం ధేయం గుర్తుచేసుకుని సాగిపో నవ్వుతూ....

ఒడిదుడుకులున్నా, జీవితమే వెలితిగా అనిపించినా

ఆనందంగా ఉన్నామన్న భ్రమలో సాగితే అదే సంతోషం

నీవు మనస్ఫూర్తిగా చేసిన పనిని నీవే మెచ్చుకో....

నిన్ను నిందించడానికి లోకం కాచుకునుందని గుర్తుంచుకో

7 comments:

  1. mana kosam manam..
    too selfish :)

    ReplyDelete
  2. " అంబరం అంచుల్ని తాకాలనికాదు నా ప్రయత్నం
    హృదయపు గదిలో కొలువుండాలన్నదే ఆశయం "

    మీ ఆశయాలకి అనుగుణంగా అల్లారు మీ కవితను.

    " ఆనందంగా ఉన్నామన్న భ్రమలో సాగితే అదే సంతోషం
    నీవు మనస్ఫూర్తిగా చేసిన పనిని నీవే మెచ్చుకో.... "

    మంచి ప్రేరణను కలిగించే పలుకులివి .
    చాలా బాగా కుదిరింది కవిత.
    కొనసాగనీ నీ పయనం ఇలాగే .
    మా తెలుగమ్మాయికి మంచి గుర్తింపు నిచ్చే కవిత ఇది.
    భేష్ .

    *శ్రీపాద

    ReplyDelete
  3. గమ్యం ధేయం గుర్తుచేసుకుని సాగిపో నవ్వుతూ...lets walk

    ReplyDelete
  4. ఆనందంగా ఉన్నామన్న భ్రమలో సాగితే అదే సంతోషం...to be like this

    ReplyDelete
  5. వ్యక్తిత్వ వికాసపు కవిత...మంచి ప్రేరణనిచ్చే కవిత..ఒడిదుడుకులున్నా, జీవితమే వెలితిగా అనిపించినా

    ఆనందంగా ఉన్నామన్న భ్రమలో సాగితే అదే సంతోషం..నిజమే కదా..

    ReplyDelete