పరువపు వయసు, మల్లె మనసు...
నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు...
కొంత అందం, మరికొంత చిలిపిదనం...
చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా...
మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు...
వెరసి ఈ తెలుగమ్మాయి.....
మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
Thursday, September 21, 2017
పరవశం
వెన్నెలను తాకిన కలువరేకులు ఎదను జల్లుమనిపించి మత్తు జల్లి మూతపడిన కళ్లలో కలలను రేపి తారలను తరిమి తాను మాయమై కిరణాలను తొందరచేసి పిలిచి... ఎర్రబడ్డ కళ్ళు ఏమైందని ప్రశ్నించ బిత్తర పోయిన మనసు తలవాల్చి నీ వెచ్చని చూపుకు దాసోహమంటూ నీ మరలి రాకకై చూస్తూ గడపసాగెను!
Excellent
ReplyDeleteపరవశంతో నవ్వుతూ ఎదురు చూడండి.
ReplyDeleteవిరహపు సెగలు విరబూస్తున్నాయి..
ReplyDeleteరాతలోను, గీతలోను.
ఇదేమి పరవశమో?
ReplyDeleteపదాల్లో పరవశం లేదు.
ReplyDelete