పరువపు వయసు, మల్లె మనసు... నల్లని కురులు, ఎన్నెన్నో ఊహలు... కొంత అందం, మరికొంత చిలిపిదనం... చిరుగాలి తరగలా, సెలయేటి నురగలా... మదినిండా భావాలు, వాటికెన్నో రూపాలు... వెరసి ఈ తెలుగమ్మాయి..... మీ మదిదోయ చేసే చిరుప్రయత్నమోయి!
దిండూ ఉండదు పరుపూ ఉండదు
మిత్రుల జ్ఞాపకాలు మూల ఉంటాయి
స్మశానవాటిక రమ్మని పిలుస్తుంది..
ఇదే నీ చివరి మజిలీ అంటుంది!!!
ఏదో సాధించి చాలి అనుకుని వెళ్ళావు
వస్తూ ఏం తీసుకొచ్చావు అంటుంది..
మొత్తానికి ఏదో విధంగా ముగిసింది!!
జీవితం జీవిత గమనం తో లంకెఆయువు ఆయువు కాదు అంకెనిరాశ నిటూర్పులను త్యజించిధీటుగా కాలానికి ఎదురేగ దలచిపచ్చా పచ్చని తోరణాల తరుణంచాలి చాలని కోరికల సమాహారందరహాసం పెదవులపై పచ్చగుంటేకల్లా కపటం మదిలో లేనట్టే~శ్రీత ధరణి
జీవితం జీవిత గమనం తో లంకె
ReplyDeleteఆయువు ఆయువు కాదు అంకె
నిరాశ నిటూర్పులను త్యజించి
ధీటుగా కాలానికి ఎదురేగ దలచి
పచ్చా పచ్చని తోరణాల తరుణం
చాలి చాలని కోరికల సమాహారం
దరహాసం పెదవులపై పచ్చగుంటే
కల్లా కపటం మదిలో లేనట్టే
~శ్రీత ధరణి