Tuesday, October 23, 2012

ఏమి చెప్పను..ఎలాగ చెప్పను?

ఆప్యాయంగా ఆహ్వానించిన అందరికీ వందనాలు
ఎక్కడ్నుండి ఎలా మొదలెట్టాలో అని అల్లాటపాగా
బాల్యంలో ఆటల గురించి చెప్పుకుందామంటే
పిల్ల పెరిగిందే కానీ మైండ్ ఎదగలేదంటారు!
చదువు సంధ్యల గురించి చెప్పుకుందామంటే
తాతకు దగ్గులు నేర్పుతుంది అనుకుంటారు!
లండన్ వింతలు విశేషాలు వివరించబోతుంటే
కొత్తవిషయాలు చెప్పు ఇవి తెలిసినవే అంటారు!
ప్రేమ గురించి కవితల్లి రాద్దామనుకుంటే
ఈ వయసులో ఇది ఒక పైత్యమంటారు!
మీ అందరి మనసులోని మాట ఏంటంటే
పండగ పూట బోర్ కొట్టించకు అంటారు!
వద్దన్నా కూడా చెప్పేంత చెడ్డపిల్లను కాను,
అందుకే అందరకీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను.

15 comments:

  1. మరీ తెనుగు సినిమా చేసెయ్యకండీ :)

    ReplyDelete
    Replies
    1. మీ డైరెక్షన్ లో అయితే సినిమా ఏంటండి సీరియల్ చేసెయ్యొచ్చు:-)

      Delete
  2. Replies
    1. ధన్యవాదములు శివప్రసాద్ గారు.

      Delete
  3. ఊహల ఊసులన్ని కలిపి చెప్తూనే ఏమి చెప్పను అని అడిగే చిలిపి తెలుగమ్మాయికి శుభాకాంక్షలు,శుభాశీస్సులు.

    ReplyDelete
    Replies
    1. చిలిపి అమ్మాయికి ఆశిస్సులందించిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  4. Replies
    1. నచ్చినందుకు సంతోషమండి.

      Delete
  5. అందమైన తెలుగమ్మాయి ఏం చెప్పినా అందరూ వింటారులెండి:)

    ReplyDelete
    Replies
    1. అందందేముందిలెండి వినసొంపైన మాటలు ఎవరుచెప్పినా వింటారు:-)

      Delete
    2. నిజం చెప్పావు అనికేత్..నిన్నగాక మొన్న మొదలుపెట్టిన అమ్మాయికి ఇన్ని కామెంట్లా..ప్చ్..:-)
      ఏమైనా మన తెలుగమ్మాయి కదా కంగ్రాట్స్ చెప్పేద్దాం...

      Delete
    3. తెలుగమ్మాయితోపాటు మంచమ్మాయని కూడా అనిపించుకుంటాను చూడండి త్వరలో:-)

      Delete
  6. miku kudaa vijaya dasami subhaakankshalu lipi mi blogpics mi maatalu baavunnayi

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ మరియు మాటలు నచ్చినందుకు ఆనందంగా ఉందండి.

      Delete
  7. mee pic and meeru cheppe paddhathi chala bagundhi lipi gaaru.....

    ReplyDelete