Monday, October 29, 2012

ఏది ఒప్పో?

పుట్టిన దగ్గర నుండి పెరుగు పెరుగన్నారు..
పెరుగుతుంటే పలుకులు నేర్చుకోమన్నారు..
పలుకులు నేర్చిన నన్ను బడికి పంపారు..
ఓనమాలు దిద్దేలోపు అన్నీ నేర్వమన్నారు..
ఆటలాడుకునే నాకు పోటీతత్వం నేర్పారు..
అన్నింటిలో ఫస్ట్ రావాలంటూ ఒత్తిడి చేసారు..
ఆలోచనతో అడుగేసి నిర్ణయించి నిలబడమన్నారు..
నిలకడగా నిలబడుతుంటే నిబంధనాల్లో నిలబెట్టారు..
ప్రేమంటే తెలియకముందే పెళ్ళిచేసుకోమంటున్నారు..
ఇప్పుడొద్దంటే ఏ వయసులో ఆ ముచ్చటంటున్నారు..
ఎవరిది రైట్ అంటారో? నాతో ఎంతమంది సమ్మతిస్తారో?

21 comments:

  1. అమ్మాయ్! నువ్విలా అభిప్రాయ సేకరణ మొదలు పెట్టి దానిని అమలు చేసేటప్పటికి నాలా అయిపోతావు. అప్పుడు అనుభవాలు రాసుకోవాలి బ్లాగులో. అందుకు తొందరపడి, అమ్మా, నాన్నా చూపించినవాడిని, మనసుకు నచ్చిన వాడిని మనువాడెయ్యి, మరు సంవత్సరం మునిమనవదో, మనవరాలునో నాఒళ్ళో వేసెయ్యి.అర్దమయిందా? ఊ అనుమరీ. అన్నావా? వినపళ్ళా...:)

    ReplyDelete
    Replies
    1. ఊ....అంటే ఒప్పుకున్నట్లే కదా:-) ఆలోచించవలసినదే

      Delete
  2. తల్లి తండ్రులు అమ్మాయికి పెళ్లి చేయటానికి అటు ఏడూ తరాలు ఎటు ఏడూ తరాలు చూసి పెళ్లి చేస్తారు... అమ్మాయి బాగుండాలి సుఖముగా ఉండాలి అని...

    అమ్మయిలు మాత్రం బయటకి వెళ్ళాలి అంటే ఎవరినో ఒకరిని పక్కన పంపుతారు... ఎక్కడ అన్న దూరముగా ఉంచాలి అంటే తెల్సిన వారి ఇంట్లో ఉంచుతారు అన్ని జాగర్తలు తీసుకుంటారు కాని పెళ్లి అనే సరికి ఎవడో ముక్కు మొఖం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని బాద పడుతుంటారు... మాములుగా బయటకి పంపటానికే ఎంతో జాగర్త తీసుకొనే వారు పెళ్లి విషయం లో ఇంక ఎంత జాగర్త తీసుకుంటారో అని మాత్రం ఆలోచించరు... ఎందుకో ఏమో????

    ReplyDelete
  3. మనసు చెప్పే మాట వింటే...
    మెదడు అది వద్దంటుంది...
    మెదడు చేపీ మాట పాటిస్తే...
    మనసు బాధ పడుతుంది...
    భావం ఆలోచింపజేసేదిగా ఉన్నా...
    శర్మగారు చెప్పినట్లు చేసేస్తే బాగానే ఉంటుంది లిపి భావన గారూ!:-)...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. అందుకని ఆలోచించకుండా ఆచరణలో పెట్టలేను కదండి:-)

      Delete
  4. మల్లె మనసు జెప్పు పరువాల ఊసులు
    మోసు కొచ్చి 'లిపి 'కి ముడుపు గట్టి
    తెలుగు బ్లాగు లందు సెలయేటి శోభవై
    వెలుగు నీకు ' జయము ' తెలుగు బాల !
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతము....మరియు వందనము.

      Delete
  5. నిలకడగా నిదానంగా నిబ్బరంగా నిర్మొహమాటంగా మీ సహచరుడ్ని మీరే ఎన్నుకోండి లిపి భావన గారు...
    వారి గుండె భారాన్ని తగ్గించుకోవడానికి అటూ ఇటూ చూసామన్న భ్రమలో ఏమీ చూడక ముంచేస్తారు....

    ReplyDelete
    Replies
    1. మీరు ఇలా అని తప్పించుకుంటున్నట్లుంది:-)

      Delete
  6. సమయం వస్తే ఆగమన్నా ఆగదు లిపి....అయినా వారి అచ్చటాముచ్చట తీర్చడం కూడా మీ భాధ్యతకదా:-)

    ReplyDelete
    Replies
    1. భాధ్యతలంటూ ఇప్పటినుండే బంధనాల్లో చిక్కుకోమంటారా చెప్పండి:-)

      Delete
  7. మీరే అలోచించుకుని ఎంచుకోవడం ఒక కళ...అది మీకు కలదనే అనుకుంటున్నాను:)

    ReplyDelete
    Replies
    1. కళ ఉన్నా కాలం కలసిరాకపోతే కాటేస్తుందేమోనని భయమండి:-)

      Delete
  8. ని భావాలతో, నీ అభిప్రాయాలతో ఏకిభవించే వ్యక్తి ఎవరైన ఉంటే, మీవాల్లతో ఆ చర్చించి ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే మంచిది...."జీవితంలో తల్లిదండ్రులు కొంతవరకే తోడుంటారు" చివరికంటూ తోడుండేది ని సహచరుడే కాబట్టి ఆ తోడుకొసమైన పెళ్ళి చేసుకోవాల్సిందే....ఆ తోడు నీకు ఇప్పుడు అవసరమా కాదా అనేది నువ్వే నిర్నయించుకొవాలి...

    ReplyDelete
    Replies
    1. మీ సూచన ఆమోదయోగ్యమే...కానీ కొన్నాళ్లు ఇలా హాయిగా గడపాలనండీ;-)

      Delete
  9. nonononononono say a big no for the yaaaaaak yewwwwwwww grrrrrrrrr ugly marriage njoy ur life .asalu badram be careful brother lanti song ammayilaku kooda undali mana kavulu em chesthunnaro?

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతానికి మీ సలహా నచ్చిందండి......మీరు చెప్పేవన్ని అనుభవపూర్వకం అనేది మాత్రం నిజం;-)

      Delete
  10. అవునా అమ్మీ...
    ఎవులేటి సెప్పినా నీ మంచికే గదా??
    నీకేటి నచ్చితే అది సేసేయి...
    కానీ చిరిగి చేట కానీయకు...:-)

    ReplyDelete
  11. నాను అట్టాంటిట్టాంటి దాన్నికాను అబ్బాయో:-)

    ReplyDelete
  12. "ఆలోచనతో అడుగేసి నిర్ణయించి" అని మీరే అన్నారు కనుక అలా కానిచ్చెయ్యండి! మీకు సలహా ఇచ్చే అంతటి దాన్ని కాదు :)

    ReplyDelete