Saturday, November 10, 2012

తెలుసుకో నన్ను

ఓయ్!....నీకిదో దురలవాటు
నన్ను అల్లరిపెట్టి ఏడిపించడం!

పల్లవి నాకన్నా బాగుందనడం

కుసుమ కురులు నిగారింపనడం
మీనాక్షి కళ్ళభాష్యం నాకు తెలపడం
నళిలో నాజూకు నాలో లేదనుకోవడం
చిట్టి చిరునవ్వుని చూసి పులకరించడం
మౌనికలా నాకు మాటలు రావనుకోవడం
వాసంతి వయ్యారాలన్నీ కావాలని కోరడం..

ఇదేమిటనడిగితే నన్ను వారిలో చూసాననడం

అమాయకంగా నీ మాటలు నమ్మాననుకోవడం
అన్నీ ఉన్న తెలుగమ్మాయిని అలా అనుకోవడం
తెలివైన వాడినని సంబరపడ్డమిలా నీ పొరపాటు!

12 comments:

  1. తెలుగమ్మాయిల్లో అందం తప్ప అన్నీ ఉన్నాయ్డి కదండీ..!

    చక్కగా ఉన్న శ్రీదేవి బొమ్మ పెట్టాక చూడకుండా ఎటు పోతారు చూస్తార్లెండి..!

    ReplyDelete
  2. అల్లరిపెట్టి ఏడిపించడేమే తప్ప మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోతాడులెండి:)

    ReplyDelete
  3. మీతో ఇలా అనిపించుకోవడం కూడా అతనికిష్టమైన అలవాటేమో:-)

    ReplyDelete
  4. అందరినీ మీలో చూసానన్నాడే కానీ అందర్నీ చూస్తాననలేదు కదండీ..
    అల్ప సంతోషిలా వున్నారాయన..
    అలా ఎంజాయ్ చేయనిద్దురు...:-)

    ReplyDelete
  5. aa painting, mee kavitha rendu adbhuthalu.aakasam lo oke roju rendu suryuullu choosina anubhoothikaligindhi.meeru

    ReplyDelete
  6. asalau meekela vachchidandee ee alochana beautiful thought i say.chaala mandi abbayilu alochinchay danni catch chesaru.u r highly taleneted nijam cheppandi meeku psychology lo degree undi kadaa?--mee veeraabhimani

    ReplyDelete
  7. anyway thank u mee tarwaatha post kosam eduruchoosthoo---mee veerabhimani thanooj

    ReplyDelete
  8. యాక్! బాలేవు.

    ReplyDelete
    Replies
    1. my dear anonymous nachanni danni marikontha sunnitham cheeppachu

      Delete
  9. చలాకీ చిలిపి అమ్మాయి....ఈ తెలుగమ్మాయి:-)

    ReplyDelete
  10. తెలివైనవాడే అందుకే అలా అన్నాడు:)

    ReplyDelete