Wednesday, November 21, 2012

నీవు లేని రోజు

అదే దారి అదే పయనం నాది ప్రతిరోజు...
ఈ పయనమెంతో భారం నీవు లేని రోజు!


నీవు నా చెంతన లేవని తెలిసి
ప్రతిచిన్ని విషయంలో నీవున్నట్లు
నీతో గడిపిన క్షణాలు అల్లరిచేస్తూ
నన్ను నానుండి దూరంచేస్తున్నాయి!


నా కమ్మని కలవని తెలిసికూడా
నిర్మించని మేడలేవో కూలినట్లు
రంగులన్నీ కలిసి నల్లగామారిపోతూ
నన్ను అ
గాధంలోకి తోసేస్తున్నాయి!

తీరం చేరని అలవోలె ఎద ఎగసి
జీవితమే అంతమైపోయినట్లు
అంతలోనే నీవు చేయి అందిస్తూ
నాతోడన్న ఆలోచనలే ఊరడిస్తున్నాయి!

15 comments:

  1. Replies
    1. మీరు మాయ
      నేను మాయ
      అంతా మాయ

      Delete
  2. బాగుందమ్మా.కాని అది ఎంత లోతున్నా అగాధమే అవుతుంది కాని అఘాధం కాదు.చిన్ని కవితల్లో ఇలాంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటే అవి రాణిస్తాయనే సదుద్దేశంతోనే చెప్పాను.అపార్థం చేసుకోవద్దు.

    ReplyDelete
    Replies
    1. సరిదిద్దితే అపార్థమెందుకు? ఆనందమండి మీరు సరిచేసినందుకు. ధన్యవాదాలు.

      Delete
  3. అప్పుడే ప్రేమవైపు మళ్ళిందే గాలి.:)

    ReplyDelete
    Replies
    1. అప్పుడే ఏంటి ఎప్పుడో మళ్ళింది:-)

      Delete
  4. Replies
    1. నా ఊసులు తోడున్నాయిగా:-)

      Delete
  5. కవిత బాగుంది, భావం ,భాషా బాగున్నాయి

    ReplyDelete
  6. బావన్ని బందీగా చేయకుండా చెప్పిన విదానం మనస్సుకు హత్తుకుంది

    ReplyDelete