నిన్ను మరచిపోవాలన్న ప్రయత్నంలో నేనోడుతూ
నిన్ను తిట్టుకుంటూ మరవలేకపోతున్నా ఎందుకంటే
మరచిపోవాలన్నా నిన్ను తలవాల్సిందేకదా అందుకని!
నిన్ను తలుస్తూ మన ఊసులన్నీ అలా జ్ఞాపకం వస్తూ
నిన్ను మరువలేకున్నా, నీవే చెప్పు మార్గమేదైనుంటే
మరచిపోతున్నా నిన్ను మరచిపోవాలన్న సంగతిని!
నిన్ను మరువక మిగిలిన సంగతులన్నీ మరచిపోతూ
నిన్ను మరిచానన్న అబధ్ధాన్నే నిజం అనుకునేకంటే
మరువలేని మధురస్మృతులను పలుమార్లు తలుస్తూ
నాతో లేవన్న విషయాన్ని మరచి నాలో ఉన్నావనుకోని!

ReplyDeleteమరువలేని మధురస్మృతులను పలుమార్లు తలుస్తూ
నాతో లేవన్న విషయాన్ని మరచి నాలో ఉన్నావనుకోని!...నైస్ భావనా!...చాలా బాగున్నాయి...మరువలేని మరపురాని విషయాలు...@శ్రీ
భావం ఎంతో బాగుంది కవితలో.
ReplyDeleteనాతో లేవన్న విషయాన్ని మరచి నాలో ఉన్నావనుకోని...
అంటూ ఇచ్చిన ముగంపు లైన్ ఇంకా ఎంతో బాగుంది.
బాగుంది.
ReplyDeletevirahaagnilo puttina mahojwala bhavam.ammyigaaru.. jayaho...
ReplyDelete"నిన్ను మరచిపోవాలన్న ప్రయత్నంలో నేనోడుతూ
ReplyDeleteనిన్ను తిట్టుకుంటూ మరవలేకపోతున్నా ఎందుకంటే
మరచిపోవాలన్నా నిన్ను తలవాల్సిందేకదా అందుకని!"
........కదా ఇలా నేను ఎన్ని సార్లు ప్రయత్నించి విఫలమయ్యానో....
మీకూ సోకిందా ఈ విరహాగ్ని:)
ReplyDeleteబాగుంది బాగుంది మా గ్రూపే:)
మంచి భావాన్ని మీవైన ఊసుల్లో అందంగా చెప్పారు.....
ReplyDeleteమరచిపోవాలన్నా నిన్ను తలవాల్సిందేకదా.............
ReplyDeletetappadhu kadaaaa