Thursday, December 6, 2012

తొలిముద్దు!

అందరాని చందమామ అసలొద్దు
నాకు నచ్చినోడే నాకెంతో ముద్దు
రాముడు, కృష్ణుడు అసలే వద్దు
నన్ను వలచినోడే నాకు ముద్దు!
ఐదడుగులున్నా ఆజానుబాహుడే
చిన్నిమేడున్నా పెద్దమనసున్నోడే
తెలివితేటల్లో నన్ను మించినవాడే
నామాట ఎన్నడూ జవదాటనివాడే!
నా కొంగు పట్టుకుని వదలని నావాడు
అత్తమామలంటే అమ్మానాన్నలంటాడు
మోముచూడక మనసందం చూసేవాడు
అమ్మాయిల కలలరాకుమారుడు వాడు!
అడిగితే అందించే ఆస్తిపరుడు నాకసలొద్దు
అడగకనే అన్నీ అమర్చేవాడే నాకు ముద్దు
అతడే కనపడితే నా ఆనందానికిలేదిక హద్దు
అడగాన్నే ఇచ్చేయనా అతనికి నా తొలిముద్దు:-)

26 comments:

  1. ఆ అదృష్టవంతుడు ఎవరో ఎక్కడున్నాడో?:)






    ReplyDelete
    Replies
    1. neney hahahahahaha srry miss telugammayi im just kidding

      Delete
    2. ఎక్కడో పుట్టి, ఇక్కడున్న నాగురించి ఊహల్లో ఊహిస్తూ ఉంటాడేమో:-)

      Delete
    3. నువ్వే కాకూడదేటి అనికేత్ బావ్...

      Delete
    4. ఓలమ్మోలమ్మో....నేనొగ్గేయ్యాలికదేటి:-)

      Delete
  2. చక్కగా వ్రాస్తున్నారు మీరు. మరి మీ బ్లాగులా ఉంటారా మీరు ? సున్నితంగా, అందంగా(అఫ్‌కోర్స్ మీ అందం ఇంకెవరికీ ఉండదనుకోండి), ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారా మీరు ? మీ చుట్టూ నవ్వులుంటాయా ఎప్పుడూ.. మీ మాట పాట లా, మీ నడక నర్తన లా, మీ చూపు బాణం లా, మీ గొంతు మురళిలా ఉంటాయా మరి ?.. ఐతే ఇమీడిఎట్ గా దోస్తానాకు నేను రెడీ..

    ReplyDelete
    Replies
    1. నేను నేనేనండి నాకు వాటితో పోలికెందుకు చెప్పండి... ఇప్పుడు దోస్త్ కాదా:-(

      Delete
  3. బాగుంది. కానీ అంతటి మనోసుందరాంగుడు అడుగుతాడంటారా...అడగక ఇచ్చిన ముద్దే ముద్దేమో...

    ReplyDelete
    Replies
    1. మీరు మరీనూ....అన్నింటిల్లో నాకు నచ్చినోడు అడుగుతాడేంటి:-)

      Delete
  4. ఏడనున్నాడెక్కడున్నాడో...:-)

    ReplyDelete
    Replies
    1. ఎక్కడున్నానాకు నచ్చినోడు మీకు తప్పక నచ్చుతాడులెండి.:-)

      Delete
  5. మరీ అన్ని గుణాలున్నోడు ఉన్నాడంటారా:)

    ReplyDelete
    Replies
    1. అన్నీకావాలంటే కొన్నాఇనా దక్కుతాయని
      తెలుగమ్మాయిని తెలివైనదాన్ని కదా:-)

      Delete
  6. ఇలాంటివాడికోసం ఎదురుచూస్తే ఊహల్లో ఊసులు చెప్పుకుంటూనే ఉండిపోతావ్ అమ్మాయ్:-)

    ReplyDelete
    Replies
    1. అదేంటండి.....అనుభవాఙ్ఞులు అటులనుట తగునా:-)

      Delete
  7. Very nice.....కానీ కష్టమే!!!!

    ReplyDelete
    Replies
    1. కష్టమైనా వాటిని పొందడమే మజా:-)

      Delete
  8. బాగుంది..త్వరలో మీ కలల రాకుమారుడు మీకు దక్కాలని, మీ తొలిముద్దు అందుకొవాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. ఓహో....అన్నీ మంచి ఆశ్శిస్సులే:-)

      Delete
  9. మరీ అంత ఆశ పడమాకు సెల్లీ.. సీన్ రివర్సయిపోగల్దు....:-)

    ReplyDelete
    Replies
    1. నువ్వే అలాగంటే....ఎలాగక్కా:-)

      Delete