Friday, April 25, 2014

నీవులేని

నీవు లేకుంటే రేయి నాకు నిదుర రానేరాదు
నీవు నాతో ఉంటే మన చెంతకు నిదురరాదు
అది వేదనలో జాగరణైతే ఇది వెన్నెలలో వేకువ

పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
భారమైన మదిని బంధించలేను భరించలేను
మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో

నా ప్రాణం కంటే నీవంటేనే నాకెంతో మక్కువ
చావుకంటే నీ ఎడబాటంటేనే భయం ఎక్కువ
నీవులేని నేను బ్రతికున్న శవంకంటేం తక్కువ

9 comments:


  1. " పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
    భారమైన మదిని బంధించలేను భరించలేను
    మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో "

    మంచి భావాలను మూట గట్టి ఎంతో మధురంగా అల్లారు మీ ఈ కవితను.
    బాగుంది.
    అభినందనలు
    *శ్రీపాద

    ReplyDelete
  2. మూడూ ముచ్చటగా ఉన్నాయి

    ReplyDelete
  3. పచ్చని పైరులా పరువాల పదాలు పొందికలా ఉంది

    ReplyDelete
  4. మొతానికి నిద్రపోరా ?? నైస్ పోయెమ్ :-)

    ReplyDelete
  5. మౌనంగా నీవులేక నేను లేనని చెప్పకనే చెప్పేసావు

    ReplyDelete
  6. చిన్ని కవితల సమ్మోహనం

    ReplyDelete
  7. నీవు లేకుంటే రేయి నాకు నిదుర రానేరాదు
    నీవు నాతో ఉంటే మన చెంతకు నిదురరాదు
    అది వేదనలో జాగరణైతే ఇది వెన్నెలలో వేకువ

    పెదవి దాటని భావాలతో అలసిపోతుంటాను
    భారమైన మదిని బంధించలేను భరించలేను
    మౌనమనేది నాకు వరమో లేక నా వైఫల్యమో

    ReplyDelete
  8. పదాల అల్లికతో ప్రియురాలి మదిలో భావాలను అలవోకగా పట్టుకున్నందుకు అభినందనలు

    ReplyDelete