Saturday, May 16, 2015

ఎన్నడో?

తరచుగా ఏడుస్తూ... 
అప్పుడప్పుడూ నవ్వేస్తూ
వ్యధని మదిలోనే అధిమేస్తూ
పంచుకోవాలనుకున్నా భాధని
ఒంటరిగా రేయి కార్చిన కన్నీరుని

ఎవరా మానస చోరుడు?

దిగులుని తీర్చి లాలించువాడు
భావోధ్వేగాలను అర్థం చేసుకుని
నేస్తమై సేదతీర్చే నన్ను కోరేవాడు
తానెవరో కనుగొని జీవించేదెన్నడో?

Sunday, April 5, 2015

ఎవరితరం

అనుకున్నది ఏదీ జరగలేదు

మనిషినే కాని దేవతనుకాను


కలిసి జీవించడం కుదరనేలేదు


పరిమళం ఇచ్చే గాలి కాదతను


లోపం ఎవరిదో తెలుపనైనా లేదు


ప్రతిబింబాన్ని చూపే అద్దమేంకాదు


ఎడబాటు ఎంతకాలమో చెప్పలేదు


జరిగేది తెలుపడం ఎవరితరం కాదు

Thursday, February 19, 2015

గట్టిబంధం.


నా ఎడమకన్ను కొట్టుకుంటుంటే..
ఎడబాటే తీరిపోయెను అనుకున్నా
నీ కుడికన్ను కొట్టుకోక ఎదభారమాయె!

నా హస్తరేఖల్లో నన్నే చూసుకుని..
నుదిటిరాతనే మార్చాలనుకున్నా
నీ నుదుటి ముడతల్లో చిక్కుకుపోయె!

నా పేరు నీ పేరున ముహూర్తమెట్టి..
విడిపోని బంధమే వేయాలనుకున్నా
ప్రేమ ముందు ముహూర్తం ఓడిపోయే!

Monday, February 2, 2015

ఆలోచించు

నీ కన్నీటి విలువను ఎరుగని వాడికై
నీ కన్నీరు వృధాకానీయకు.
నలుగురిలో నిన్ను కన్నెత్తి చూడనివాడిని
నీవు కన్నీత్తి ఎన్నడు చూడకు 
తడిలేని కంటిని చూసి కష్ష్టాలు లేవనుకోకు
కన్నీరు మున్నీరై ఏడిస్తేనే దుఖమనుకోకు
భాధను దాచి నవ్వితే అది సంతోషమనుకోకు
నటించే వారి నడ్తని చూసి ప్రేమనుకోకు
తెలివి లేకుండా ఆలోచించి మోసపోకు.

Sunday, December 14, 2014

ఈ జన్మ

మళ్ళీపుట్టిన నాకు మరుపన్నది వరమైనది
ఏ బాంధవ్యమూ వద్దు నీకు నీవే తోడన్నది!

అనిశ్చల అంతరంగమైతే ఉప్పెనై రోధిస్తుంది
మరల తనకితానే సర్దిచెప్పుకుని సాగుతుంది!

కోయిలనై కూయాలనుకుని కాకిలా అరిచింది
నవ్వుతున్న ప్రతి ముఖంలో సంతోషంలేదంది!

తనువుపై గాయాలు మార్పే మందు దొరికింది
మనసుగాయం మార్చమని మరణాన్నే కోరింది


Saturday, November 15, 2014

చాలు!

నాకు అవసరమైన మేరకే ఆశిస్తాను
అనుకున్నది నెరవేరితే అంతే చాలు!

నాలోని క్రోధానికి కళ్ళెంవేసి ఆపుతాను
అంతే శాంతి నన్ను ఆవహిస్తే చాలు!

నా శక్తికి మించిన సహాయమే చేస్తాను
అలజడి లేని జీవితమైతే అంతే చాలు!

నాకుతెలిసీ నిస్వార్థంగా వ్యవహరిస్తాను
అందినంత ఆనందం నాకు దక్కితే చాలు!



Monday, October 20, 2014

ప్రణయం

కనులు మౌనంగా ఊసులే చెబుతాయి...
అర్థం చేసుకోగలిగితే గ్రంధాన్నే విప్పుతాయి.
ఎవరన్నారు కనులు రోధిస్తున్నాయని...
మనసు ఏడిస్తే కళ్ళు దాన్ని చెబుతున్నాయి.
వింతవిఢ్యూరాల మిళితమీ ప్రణయం
ఎప్పుడు మొదలౌతుందో ఎలా ముగుస్తుందో
తెలుసుకుని మసలడం చాలా కష్టం....
గమ్యం ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు
వెలిగే దీపంతోపాటు పొగలువతుంటాయి
జ్ఞాపకాలెన్నో నిద్రలేని రాత్రులు అవుతాయి.

Tuesday, September 9, 2014

ఎలా!?

ప్రేమలో పసిదాన్ని నేను,
ప్రేమించానని చెప్పేది ఎలా!
ఎంత ప్రేముందో చూపేదెలా?

నీవంటే నాకు చాలా ఇష్టం
గుండె నిండి నీవని చెప్పేదెలా!
నిన్ను నేను పొందేది ఎలా?

ప్రణయ తాపం నాలో ఎగసెనని
నీలోనూ ఆ మంటలు రేగెనేల!
జ్వాలనార్పే మార్గమేదో చెప్పవేల?

మనసు నీవు నావాడివంటున్నది
నీకు ఉన్న ప్రేమనైనా చూపించవేల!
సంబంధమేదో పెనవేసెయ్యి ఏదోలా.

Sunday, August 31, 2014

చలనం

నా గుండె గళం విప్పితే తెలిపేది....
నీ అచేతన మనసుకి అర్థమయ్యేలా

నా మనసుకే మాటలు వస్తే పలికేది....
మౌనమే మూటలమాటలు వెదజల్లేది

నా కవితలకే ప్రాణం వస్తే తెలిపేది....
ప్రతి అక్షరంలో దాగిన భావ సవ్వడిని

నా కవళికలకే చలనం ఉంటే చెప్పేవి
చెరిపేసినా చెరగని గుర్తులనే చూపేవి

Tuesday, August 5, 2014

చాలు చాలు

తడవకో రంగుమార్చి ప్రలోభ పెట్టే గుండెలు వేలు..
మండుతున్న గుండెను చల్లార్చే ఒక్కరుంటే చాలు!

వాంఛల సరిహద్దుదాటి కదలని అడుగులు మెండు
కష్టాల్లో కడదాకంటూ తోడు ఉండేవారు ఎందరుండు?

దొంగలా దాక్కొని ఆచితూచి ప్రేమను పంచే దొరలు..
బరువు భాధ్యతలు మాత్రం భరించలేని బడాబాబులు!

మజిలీకి చేరువయ్యే మలుపుల్లో ఎప్పటికీ చేజిక్కనిది
సొంతం అంటూ పొందలేని విచిత్ర వలయ జీవితమిది