Saturday, November 17, 2012

ఎవ్వరు నీవు?

నా రేయి నీవే, పగలు నీవే
నా మౌనం నీవే, మాటా నీవే
నా బాట నీవే, గమ్యం నీవే
నా కల నీవే, కలవరము నీవే
నా అలుక నీవే, తీర్చేది నీవే
నా బలమూ, బలహీనతా నీవే
నా నిన్నలో నీవు, రేపట్లో నీవే
నా ఆశ నీవే, నిరాశవి నీవే
నా అద్దంలో ప్రతిబింబం నేవే
నా పాట నీవే పల్లవి నీవే
నా వేషం నీవే, భాషా నీవే
ఏమని చెప్పను నీవెవరో?
నా జీవన అభిలాష నీవని
నా అస్తిత్వపు రూపురేఖ నీదని
వాస్తవంలో నేను చూడని రూపానికి
స్వప్నజగతిలో నా మనోహరుడివని!!

20 comments:


  1. ఉండి ఉండి ఒక్క సారి భక్తి తత్వం లోకి జారిపోవడం? ఆయనే సర్వేశ్వరుడు

    ReplyDelete
    Replies
    1. భక్తా!!1 ఏమో అయ్యుండొచ్చు ఆయనే సర్వేశ్వరుడు.

      Delete
  2. స్వప్న సుందరుడనమాట... :)
    బాగుంది భావాన్ని కవితలో కూర్చిన తీరు...

    ReplyDelete
    Replies
    1. ఓహో...మెచ్చేసుకున్నారుగా:-)ఆనందమాయెనే!

      Delete
  3. బాగుంది, చివరి నాలుగు లైన్లు ఇంకా బాగున్నాయ్..

    ReplyDelete
  4. కలల రాకుమారుడు. కవిత బావుంది.

    ReplyDelete
  5. స్వప్న జగతిలోని రాకుమారుడు మీ జీవితంలోకి రావాలని....

    ReplyDelete
    Replies
    1. అప్పుడే వద్దులెండి కొన్నాళ్ళు ఇలా కలలోకి రానీయండి:-)

      Delete
  6. meeru naa gurinchi raasina kavitha chaala bavundi.thank u . hahhahahah

    ReplyDelete
    Replies
    1. అలా అనుకుని మీరుకూడా నాలాగే కలలు కంటున్నారన్నమాట:-)ఓహో హో

      Delete
    2. nenu kinda cheppaga meeru abaddalakoru ani hahahahahaah now do u recognize the fact that iam f**in genius .boo hoooooo

      Delete
  7. i dont know y just have this gut feeling that u r a big liar

    ReplyDelete
    Replies
    1. ఫీలింగ్ కి గట్స్ ఎందుకు? కళ్ళున్నందుకు కలలు తప్పవు, మాట్లాడేప్పుడు అబద్ధం ఆడకా తప్పదు:-)

      Delete
  8. నా జీవన అభిలాష నీవని
    నా అస్తిత్వపు రూపురేఖ నీదని.. extraordinary feel...congrats..

    ReplyDelete
    Replies
    1. మీరు మాత్రమే కలని ఫీల్ అయినట్లున్నారు:-) మెచ్చారు

      Delete
  9. అమ్మాయ్....నీ అల్లరి అందంగా అలరిస్తుంది;-)

    ReplyDelete
    Replies
    1. ఆకతాయిగా అల్లరిచేస్తూ ఏమైనా అంటే తిట్టండి పర్వాలేదు.:-)

      Delete
  10. అన్నింటిలో నేనని....చివరికి కలలో అనడం అంతా అబద్ధం:)

    ReplyDelete