Thursday, December 20, 2012

ఏంచేయాలో...

అలంకరించుకోవాలన్న ఆలోచనేరాదు
చంద్రకాంతితో మోమును కడగడంలేదు
సాగరంలో ముత్యానై స్నానమాడలేదు
శ్రావ్యమనై సంగీతమేదీ వినబడ్డంలేదు
ఆశాకిరణాలు ఏవీ నన్ను తాకడంలేదు
కాలికున్న మువ్వలు సడిచేయడంలేదు
గాలితెమ్మెరలు కూడా ఊసులాడ్డంలేదు
నీవు లేక ఏవీ సక్రమంగా జరగడంలేదు
నాలోనే దాగిఉన్నావన్నా కన్నీరాగలేదు
మరువలేని మనసు మాట వినడంలేదు
నీపై ఉన్నది ప్రేమని చెప్పడం నాకురాదు.

12 comments:

  1. చుట్టూ ఎన్నున్నా మది కోరుకున్నది లేనిదే...ఏదీ లేదు.
    భావం సింపుల్ గా కవితలో చెప్పారు. బాగుంది, ఎంచుకున్న పెయింటింగ్ కూడా.

    ReplyDelete
  2. left side pic chaala chaala baagundandi? nijam enta baagundo..........

    ReplyDelete
  3. మదిలో వెలితి అక్షరాలలో నిండింది. బావుంది కవిత.

    ReplyDelete
  4. this is so far ur best . i can sense the pain and beauty.do better

    ReplyDelete
  5. రాదు రాదంటూనే అందంగా చెప్పారు:-)

    ReplyDelete
  6. cheppdaniki take your own time:-)

    ReplyDelete
  7. రాదు రాదంటూనే అందంగా చెప్పారు:-) super lipi...

    ReplyDelete
  8. బావుంది.. రాదు రాదంటూనే అందంగా చెప్పారు:-)

    ReplyDelete
  9. బావుంది కవిత.

    ReplyDelete
  10. అవన్నీ అవసరమా ప్రేమలో:-)

    ReplyDelete
  11. వ్యాఖ్యలిడిన ప్రతి మనస్పందనకు ప్రణామం...

    ReplyDelete