Wednesday, December 23, 2015

అప్పుడు-ఇప్పుడు


నేనెరిగిన కార్యం కేవలం నీ అడుగు నీడలో నేను

అప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే దూరం

ఈ నిరీక్షణలో నేను ఏమౌతానో అన్న చింతలేదు

అప్పటి ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తున్నా

కాలమిచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ

దూరమవలేక భాధప్పుడు, దూరమై వ్యధిప్పుడు

ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు

ఆశలప్పు
డు అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి

Wednesday, November 11, 2015

నాకు తెలిసింది

నేనెరిగిన చర్య కేవలం నీ అడుగు నీడలో నేను
అప్పుడు దగ్గరై దూరం, ఇప్పుడు దూరమే దూరం
ఈ నిరీక్షణలో నేను ఏమౌతానో అన్న చింతలేదు
అప్పుడున్న ధ్యాసలోనే ఇప్పుడు శ్వాసపీలుస్తున్నా!

కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!


Wednesday, September 16, 2015

ప్రియురాలు పిలిచె

ప్రియ ప్రియతమా...వానే వచ్చి ఒళ్ళే తడిసె

వలపు వసంతమే నిన్ను తలచి మైమరిచె!!

భ్రమరమే పులకరించి మకరందాన్ని కోరె
 

చూసిన నా కళ్ళలో ప్రేమ మెరుపుమెరిసె

నీ కోసం ఎదురుచూసే నయనాలే దాహమనె

ఆకలిని మరచిన దేహానికి నిదుర రాకపోయె

మది కోయిల రాగమే పాడి నిన్ను పిలిచె

జాగు చేయక రావా...నీ ప్రియురాలు పిలిచె!!

Monday, August 17, 2015

నీవు

దిగులుగా కూర్చుని ఆలోచిస్తే..

అకస్మాత్తుగా నువ్వు గుర్తొస్తావు


నలుగురిలో ఒంటర్ని అయినప్పుడు


అనుకోకుండానే కన్నీరు అవుతావు


మాటలు రాక మౌనంగా కూర్చుంటే


మనసునే జ్ఞాపకాలతో మెలిపెడతావు


మరచిపోవాలని మనసుని మభ్యపెడితే


నా రూపమై నా కనుల ముందు ఉంటావు!

Monday, June 15, 2015

ప్రేమ

                              
ఎందుకింత అనురాగమంటే ఏంచెప్పను!?
 నా కోసం వేడుకుంటే నేను వద్దు అనను..కానీ
 నన్నే కావాలని వేడుకుంటే మాత్రం వశమవను

నా నుండి నీవు ఆశించేది ఏమిటో ఏమో!
నా హృదయాన్ని కోసి నాకే కానుకిచ్చావు.
నా నవ్వులో ఏం మెరుపు చూసావో ఏమో!
నా తనువులోని అణువణువునీ తడిమేవు.
                                                                                                                                                           


Saturday, May 16, 2015

ఎన్నడో?

తరచుగా ఏడుస్తూ... 
అప్పుడప్పుడూ నవ్వేస్తూ
వ్యధని మదిలోనే అధిమేస్తూ
పంచుకోవాలనుకున్నా భాధని
ఒంటరిగా రేయి కార్చిన కన్నీరుని

ఎవరా మానస చోరుడు?

దిగులుని తీర్చి లాలించువాడు
భావోధ్వేగాలను అర్థం చేసుకుని
నేస్తమై సేదతీర్చే నన్ను కోరేవాడు
తానెవరో కనుగొని జీవించేదెన్నడో?